Mahesh Babu, Nagarjuna: చివరికి ఆ వీడియో తో సద్దుమనిగిన గొడవ.. అసలు ఏమి జరిగందంటే..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టినరోజు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఇక నాగ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా సోషల్ మీడియాలో పోస్టులు వేశారు. ఈక్రమంలోనే మహేష్ బాబు చేసిన పోస్ట్ అక్కినేని అభిమానులను హర్ట్ చేసింది. “హ్యాపీ బర్త్ డే నాగార్జున” అంటూ ఏకవచనంతో విష్ చేశాడు. అది కాస్తా రచ్చకు దారితీసింది. దీనిపై నాగార్జున అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబుని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

మహేష్ (Mahesh Babu) ట్వీట్ చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘నాగార్జున మీకన్నా సీనియర్ కదా..? పేరు పక్కన సార్ లేదా గారు అని పెట్టి మర్యాద ఇస్తే బాగుండేది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మహేష్ బాబు, నాగ్ అభిమానులు మధ్య సోషల్ మీడియాలో ఒక డిబెట్ మొదలైంది. ఈక్రమంలోనే ఒక మహేష్ అభిమాని గతంలో నాగార్జున ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఒక వీడియోని షేర్ చేయగా గొడవ కొంచెం సద్దుమణిగినట్లు అయ్యింది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఊపిరి మూవీ టైంలో నాగార్జున ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మహేష్ బాబు ఫోన్ కాల్ గురించి తెలియజేశాడు. ఈక్రమంలోనే మహేష్ తనని ‘నాగ్’ అంటూ ఏకవచనంతోనే పిలుస్తాడు అని తెలియజేశాడు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. వారిద్దరి మధ్య అంతటి స్నేహం ఉంది కాబట్టే మహేష్ బాబు అలా ఏకవచనంతో ట్వీట్ చేశాడని సూపర్ స్టార్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus