Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ‘కలర్ ఫోటో’ సక్సెస్ మీట్.. ఇది ప్రేక్షకుల విజయం: చిత్రయూనిట్

‘కలర్ ఫోటో’ సక్సెస్ మీట్.. ఇది ప్రేక్షకుల విజయం: చిత్రయూనిట్

  • October 31, 2020 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కలర్ ఫోటో’ సక్సెస్ మీట్.. ఇది ప్రేక్షకుల విజయం: చిత్రయూనిట్

సుహాస్, చాందిని చౌదరి జంటగా కొత్త దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన చిత్రం కలర్ ఫోటో. అక్టోబర్ 23న ఆహా వేదికగా ఈ సినిమా విడుదలైంది. సునీల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. సాయి రాజేష్ నీలం, బెన్నీ నిర్మించిన ఈ చిత్రాన్ని సందీప్ రాజ్ తెరకెక్కించారు. వారం రోజుల తర్వాత సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు చిత్రయూనిట్. తొలివారంలో కలర్ ఫోటో చిత్రాన్ని 7 లక్షల మంది చూసారు. ఇది ప్రేక్షక విజయం అని.. మంచి సినిమాలు ఎప్పుడు వచ్చినా ఆదరిస్తారనే విషయం ఈ విజయంతో మరోసారి అర్థమైందని సంతోషాన్ని వ్యక్తం చేసారు యూనిట్. ఈ సందర్భంగా ప్రేక్షకులకు, అలాగే కలర్ ఫోటో విజయానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ.. ’ఈ సినిమా అక్టోబర్ 23 సాయంత్రం 6 గంటలకు విడుదలైంది. రిలీజ్ అయిన తర్వాత కొందరి తప్పుడు రివ్యూస్ చూసి టెన్షన్ పడ్డాము. ఆ తర్వాత రెండు మంచి రివ్యూలు వచ్చాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ విజయం ఆగలేదు. చాలా మంచి సినిమా తీసారంటూ అంతా కన్నీరు పెట్టుకుంటున్నారు.. సినిమా చూసిన తర్వాత ఫోన్స్ చేసి ఎమోషనల్ అవుతున్నారు. తొలివారంలోనే మా సినిమాను 7 లక్షల మంది చూసారు. టికెట్‌కు 100 రూపాయల చొప్పున లెక్క వేసుకున్నా తొలివారంలోనే మాకు 7 కోట్లు వచ్చాయి. దర్శకుడు సందీప్ రాజ్ మాకు మంచి సినిమా ఇస్తాడనుకున్నాం కానీ గొప్ప సినిమా ఇచ్చాడు. కలర్ ఫోటో చూసిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలా మంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఫోన్లు చేసి అభినందిస్తున్నారు.. మా సినిమా గురించి ట్వీట్స్ కూడా చేసారు.. అంతా బాగా సపోర్ట్ చేసారు. ముఖ్యంగా అల్లు అరవింద్ గారు, బన్నీ వాసు గారు ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేం. ఆహా ప్లాట్ ఫామ్ ఇచ్చి మా సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా చేసారు. నటీనటులు కూడా ప్రతీ ఒక్కరూ న్యాయం చేసారు. ఇది సమిష్టి విజయం’ అని తెలిపారు.

దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ మనస్పూర్థిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నేనిక్కడ ఉన్నానంటే కారణంగా వాళ్లే. వాళ్లు లేకపోతే నేను లేను. కొత్త దర్శకుడికి ఇంత ప్రోత్సాహం అందిస్తున్న అందరికీ పాదాభివందనాలు. ఈ సినిమాలో నా ఫెవరేట్ కమెడియన్, స్టార్ హీరో సునీల్ గారితో పని చేసాను. ఆయన లేకపోతే కారెక్టర్ లేదు. అలాగే ఈ సినిమాలో ప్రతీ చిన్న పాత్ర కూడా కీలకమైందే. నేను చాలా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్లు మాత్రం చాలా ఓపిగ్గా భరించారు. అలాగే సాయి రాజేష్ గారు, బెన్నీ గారికి నన్ను నమ్మినందుకు కృతజ్ఞతలు. సుహాస్‌ను హీరో చేయాలనుకున్నాను.. చేసాను. నేను కథలో నా కళ్ళతో వీళ్లందర్నీ చూసాను.. అదే సినిమాలో చూపించాను. ఈ సినిమాలో పని చేసిన టెక్నీషియన్ కానీ.. నటున్ని కానీ కళ్లు మూసుకుని ఇకపై ఏ సినిమాలో అయినా పెట్టుకోవచ్చు.. ఇది నా హామీ’ అని తెలిపారు.

హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా విషయంలో ఇలాంటి వేడుక మరొకటి జరుపుకోవాల్సి వస్తుందని నేను ముందే చెప్పాను. ఇప్పుడు ఇదే జరిగింది. కలర్ ఫోటో నా జీవితంలో మరిచిపోలేను. ఈ చిత్రంలో చాలా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా బ్లాక్‌బస్టర్ అని నా సినిమాపై చూడాలనుకున్న కల ఈ సినిమాతో నెరవేరింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరు కష్టపడి కాదు యిష్టపడి పని చేసారు..’ అని తెలిపారు.

నటుడు హర్ష మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నాకు అంతా ఫుడీ కారెక్టర్స్ ఇచ్చారు. అలాంటి పాత్రలకే నన్ను పరిమితం చేసారు. కానీ తొలిసారి నా కెరీర్‌లో ఇంత బరువైన పాత్ర ఇచ్చినందుకు సాయి రాజేష్ అన్న, బెన్నీ అన్నకు థ్యాంక్స్. దర్శకుడు సందీప్ రాజ్ కూడా నన్ను ఏ కళ్ళతో చూసాడో కానీ మొత్తానికి చూసాడు. 2019 అక్టోబర్ 22న ఈ కారెక్టర్ నాకు సుహాస్, సందీప్ వచ్చి చెప్పారు. సరిగ్గా 2020 అక్టోబర్ 22 రాత్రి ప్రీమియర్స్ పడ్డాయి. నా కారెక్టర్ చూసి నవ్వుకుంటారేమో అనుకున్నా.. కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా కమెడియన్, నటుడికి మధ్య చిన్న హద్దు ఉంటుంది. అది దాటితే ఎబ్బెట్టుగా ఉంటుందేమో అనుకున్నా. కానీ క్లైమాక్స్ సీన్ చూసి నవ్వుకోనపుడే నేను పాస్ అయ్యానని అర్థమైపోయింది. అంతేకాదు నాకు యిష్టమైన కమెడియన్ ముందు.. యిష్టమైన సినిమా సొంతం నుంచి ఆ డైలాగ్ మళ్లీ ఆయన ముందే చెప్పడం అనేది నాకు చాలా నచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన ఏడేళ్ళ తర్వాత నన్ను నటుడిగా గుర్తించారు. ఇన్నాళ్ల నా కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దక్కింది. ఈ విజయానికి కారణమైన అందరికీ మనస్పూర్థిగా ధన్యవాదాలు..’ అని తెలిపారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఈ సినిమా గురించి చాలా కలలు కన్నాం.. ఎలాగైనా హిట్ కొట్టి చూపించాలనుకున్నాం. ఇప్పుడు ఇదే చేసాం. నన్ను హీరోగా యాక్సెప్ట్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా విజయం కోసం ఎంతగానో వేచి చూసిన నా భార్యకు కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి రాజేష్ అన్న, బెన్నీ అన్నకు థ్యాంక్స్’ అని తెలిపారు.

నటుడు సునీల్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం అంతా యంగ్ స్టర్స్‌ పని చేసారు. వాళ్లతో వర్క్ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. నేను ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను. నన్ను చాలా బాగా చూసుకున్నారు. అంతా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమాలో వాళ్లు చెప్పినట్లే చేసాను. కలర్ ఫోటో చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయి. కొట్టకుండా.. తిట్టకుండా.. చంపకుండా భలే భయపెట్టావ్ భయ్యా అంటూ అంతా ఫోన్ చేసి మరీ ప్రశంసించారు. అక్కడే నా కారెక్టర్ సక్సెస్ అయ్యిందని అర్థమైంది. ఇండస్ట్రీకి నేను వచ్చిందే విలన్ అవుదామని.. కానీ మనలో ఏదో కామెడీ సెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా పేరు తెచ్చుకున్నా. ఇప్పుడు కలర్ ఫోటోతో విలన్ కల కూడా నెరవేరింది. ఈ సినిమాకు గుండె చప్పుడు అంటే కాల భైరవ మ్యూజిక్. సందీప్ రాజ్ చాలా బాగా డిజైన్ చేసాడు.. హర్ష కామెడీ టైమింగ్ నాకు చాలా యిష్టం. సుహాస్ వాయిస్ అంటే నాకు చాలా యిష్టం. హీరోయిన్ చాందిని చాలా నటించింది. నిర్మాత సాయి రాజేష్ గారు మంచి ఫుడీ.. అమృత ప్రొడక్షన్స్ అని పేరుకు తగ్గట్లే అమృతం లాంటి ఫుడ్ అందించారు..’ అని తెలిపారు.

ఈ సక్సెస్ మీట్‌కు సినిమాలో ప్రిన్సిపల్ పాత్ర పోషించిన సాయి, సునీల్ భార్యగా నటించిన నటి శ్రీవిద్య మహర్షి తదితరులు హాజరయ్యారు.

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amrutha production\
  • #Chandini Chowdary
  • #Colour Photo
  • #Producer Sai Rajesh
  • #Sai Rajesh

Also Read

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

related news

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

Champion: మిక్కీ.. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Champion: మిక్కీ.. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Avatar 3: ఆ ‘పిల్ల’ సినిమా ముందు నిలవలేకపోయింది!

Avatar 3: ఆ ‘పిల్ల’ సినిమా ముందు నిలవలేకపోయింది!

Varanasi: ఫారిన్ లొకేషన్లే కాదు.. లోకల్ ఫైట్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు!

Varanasi: ఫారిన్ లొకేషన్లే కాదు.. లోకల్ ఫైట్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు!

Og Sequel: ‘ఓజీ’ సీక్వెల్‌ దానయ్య ముందుకు రావడం లేదా? చర్చలోకి కొత్త నిర్మాత పేరు?

Og Sequel: ‘ఓజీ’ సీక్వెల్‌ దానయ్య ముందుకు రావడం లేదా? చర్చలోకి కొత్త నిర్మాత పేరు?

Chiru-Venky Song: స్పెషల్‌ డేట్‌కి.. స్పెషల్‌ సాంగ్‌ రెడీ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పుడంటే?

Chiru-Venky Song: స్పెషల్‌ డేట్‌కి.. స్పెషల్‌ సాంగ్‌ రెడీ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పుడంటే?

trending news

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

8 hours ago
Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

10 hours ago
ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

10 hours ago
పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

11 hours ago
Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

12 hours ago

latest news

Dhurandhar : పాకిస్తాన్ లో రిలీజ్ అవ్వకుండానే , అక్కడ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘ధురంధర్’..!!

Dhurandhar : పాకిస్తాన్ లో రిలీజ్ అవ్వకుండానే , అక్కడ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘ధురంధర్’..!!

10 hours ago
Bollywood: 2025 బాలీవుడ్ మార్కెట్.. సౌత్ సినిమాలకు ఓ గుణపాఠం!

Bollywood: 2025 బాలీవుడ్ మార్కెట్.. సౌత్ సినిమాలకు ఓ గుణపాఠం!

10 hours ago
Samantha: చీరని తొక్కి.. మీదకొచ్చి.. సమంతకు భయంకరమైన ఎక్స్‌పీరియెన్స్‌!

Samantha: చీరని తొక్కి.. మీదకొచ్చి.. సమంతకు భయంకరమైన ఎక్స్‌పీరియెన్స్‌!

11 hours ago
ఈ సైజ్‌లు చాలవు.. ఇంకా పెంచమన్నారు.. స్టార్‌ హీరోయిన్‌ రచ్చ రచ్చ చేస్తోందిగా..

ఈ సైజ్‌లు చాలవు.. ఇంకా పెంచమన్నారు.. స్టార్‌ హీరోయిన్‌ రచ్చ రచ్చ చేస్తోందిగా..

11 hours ago
Sujeeth: ఆ ‘ఓజీ’ సీన్‌ ఒరిజినల్‌ కాదు.. కాపీనే అంటున్న సుజీత్‌.. ఎవరు తొలుత తీశారంటే?

Sujeeth: ఆ ‘ఓజీ’ సీన్‌ ఒరిజినల్‌ కాదు.. కాపీనే అంటున్న సుజీత్‌.. ఎవరు తొలుత తీశారంటే?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version