Abhinav Gomatam: హీరోగా కమెడియన్ అభినవ్ గోమఠం..సినిమా టైటిల్ ఏంటో తెలుసా?

అభినవ్ గోమఠం.. అందరికీ సుపరిచితమే. పలు షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఇతను తర్వాత ‘మైనే ప్యార్ కియా’ ‘బిల్లా రంగా’ ‘జగన్నాటకం’ వంటి సినిమాల్లో నటించాడు. అయితే ‘మళ్ళీ రావా’ సినిమా ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ తర్వాత వచ్చిన ‘ఈనగరానికి ఏమైంది?’ అనే సినిమాతో స్టార్ అయిపోయాడు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కౌశిక్ అనే పాత్రలో అభినవ్ పండించిన కామెడీ గురించి ఇంకో పదేళ్ళ పాటు ప్రత్యేకంగా చెప్పుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు.

తర్వాత ఇతని డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోయింది. వెన్నెల కిషోర్..లా హీరో పక్కనే ఉండి కామెడీ పండించే రోల్స్ ఇతనికి కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు రూటు మార్చి హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అభినవ్. ఇతన్ని స్టార్ గా నిలబెట్టింది ‘మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో.. కమల్ హాసన్’ అనే డైలాగ్.’ఈనగరానికి ఏమైంది’ లో పాపులర్ డైలాగ్ ఇది.

ఈ డైలాగ్ స్పూర్తితో ‘మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ అనే టైటిల్ ను అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాకి ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి తిరుప‌తి రావు ఇండ్ల దర్శకుడు. వైశాలి రాజ్ హీరోయిన్‌. ‘కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్’ బ్యానర్ పై భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘పొలిమేర‌-2 ‘ చిత్రాన్ని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కమెడియన్ నుండి హీరోలుగా మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయారు. మరి అభినవ్ (Abhinav Gomatam) హీరోగా ఎంత వరకు క్లిక్ అవుతాడో చూడాలి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus