టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్ బీబీ ఈ తెల్లవారు జామున మరణించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు తుది శ్వాస విడిచారు. అలీ సొంత ఊరు అయిన రాజమండ్రి.. ఆయన ఇంట్లోనే ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఇక అలీ ప్రస్తుతం షూటింగ్ రీత్యా.. రాంచీ లో ఉండగా… ఈ వార్త తెలీడంతో వెంటనే హైదరాబాద్ కు బయల్దేరినట్టు తెలుస్తుంది. ఇక జైతున్ బీబీ భౌతిక కాయాన్ని కూడా రాజమండ్రి నుండీ హైదరాబాద్ కు చేరుస్తున్నారని సమాచారం. ఎన్నో చిత్రాలు, మరియు టీవీ షో ల ద్వారా మనల్ని అలరిస్తూ వస్తున్న అలీ .. అనేక సందర్భాల్లో తన తల్లి గొప్పతనం గురించి చెబుతూనే వచ్చారు. ఇక తను ఈరోజు ఇలా ఉన్నాను అంటే.. అది నా తల్లిదండ్రుల వలనే అని కూడా చెబుతూ… అనేక సేవా సంస్థలను కూడా నడుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే..!
View this post on Instagram
తల్లి ముందు అందరూ ఒక్కటే అని నిరూపించిన ఆలీ! Comedian #Ali Respect Towards His Mother!
A post shared by Filmy Focus (@filmyfocus) on