మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దాదాపుగా 17 సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది. అప్పటి పరిస్థితుల్లో 18 స్థానాల్లో విజయం సాధించడం అంటే సులువైన విషయం కాదు. అయితే వేర్వేరు కారణాల వల్ల తర్వాత రోజుల్లో చిరంజీవి రాజకీయాలకు పూర్తిస్థాయిలో దూరమయ్యారు. అయితే చిరంజీవిని ఎంతో అభిమానించే నటులలో ఒకరైన సునీల్ ఒక సందర్భంలో మెగాస్టార్ కు రాజకీయాలలో ఆశించిన ఫలితాలు దక్కకపోవడం వెనుక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
చిరంజీవి గారిని స్పూర్తిగా తీసుకుని తాను సినిమా రంగంలోకి వచ్చానని సునీల్ (Sunil) తెలిపారు. చిరంజీవి అన్నయ్యకు ఓపిక ఎక్కువని నాకు ఆయన చేసిన సహాయం నేను అస్సలు మరవలేనని సునీల్ వెల్లడించారు. సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవికి తిరుగులేదని ఆయనే నంబర్ వన్ అని సునీల్ పేర్కొన్నారు. రాజకీయాలలో సక్సెస్ అనేది వేర్వేరు వ్యక్తులు, అంశాలపై ఆధారపడి ఉంటుందని సునీల్ చెప్పుకొచ్చారు.
చిరంజీవి చుట్టూ ఉండే వ్యక్తులు చేసిన తప్పుల వల్ల మెగాస్టార్ రాజకీయాలలో ఆశించిన ఫలితాలను అందుకోలేదని చెప్పుకొచ్చారు. సునీల్ చెప్పిన విషయాలతో మెగాస్టార్ ఫ్యాన్స్ సైతం ఏకీభవిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. పవన్ (Pawan Kalyan) తరపున చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేస్తారని ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ధృవీకరణ వచ్చే వరకు ఈ వార్తలను నమ్మాల్సిన అవసరం లేదు.
చిరంజీవి విశ్వంభర సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా చిరంజీవి రేంజ్ పెరుగుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. మల్లిడి వశిష్ట ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.