Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ రివ్యూస్ చెప్పి.. షోలో ఛాన్స్ కొట్టేశాడు!

బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఓటీటీ వెర్షన్ కూడా టెలికాస్ట్ అయింది. ఇప్పుడు సీజన్ 6 మొదలుకానుంది. సెప్టెంబర్ 4 నుంచి కొత్త సీజన్ మొదలుకానుంది. దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా వచ్చాయి. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. వీరిలో బుల్లితెర దంపతులు రోహిత్-మెరీనా అబ్రహం కూడా ఉన్నారని టాక్.

అలానే కామన్ మ్యాన్ క్యాటగిరీలో ఓ వ్యక్తి ఎంటర్ అవ్వబోతున్నారని తెలుస్తోంది. అతడు యూట్యూబర్ ఆదిరెడ్డి అని సమాచారం. బిగ్ బాస్ రియాల్టీ షోలపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చెబుతూ.. నెటిజన్లకు కాస్త దగ్గరయ్యారు ఆది రెడ్డి. అతడిని కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ షోలో తీసుకున్నారట. ఆదిరెడ్డి సొంతూరు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజ‌క‌వ‌ర్గంలోని వరికుంట‌పాడు. ఆదిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. తల్లితండ్రులు, అన్నయ్య, అక్కచెల్లెలితో కలిసి ఉంటారు ఆదిరెడ్డి.

నెల్లూరులో డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశారు ఆదిరెడ్డి. అదే సమయంలో వైఎస్సార్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కంతో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. క్యాంపస్ సెలెక్షన్ లో రూ.10 వేల ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఉద్యోగంలో చేరే సమయంలో అతడి తల్లి మరణించింది. దీంతో రెండేళ్ల పాటు ఇంట్లోనే ఉన్నారు ఆదిరెడ్డి. ఆ తరువాత ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్లారు. అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 2 మొదలైంది.

ఆ షోని విశ్లేషిస్తూ.. సరదాగా ఓ వీడియో చేశారు. అది క్లిక్ అవ్వడంతో సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టారు. అప్పటినుంచి బిగ్ బాస్ షోపై రివ్యూస్ ఇస్తూనే ఉన్నారు. అలా పాపులర్ అయిన ఆదిరెడ్డి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అవ్వబోతున్నారు. మరి తన ఆట తీరుతో జనాలను మెప్పించగలరో లేదో చూడాలి!

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus