బాలయ్య భగవంత్ కేసరి వర్సెస్ శివరాజ్ కుమార్ ఘోస్ట్.. పోటీ తప్పదంటూ?

శాండిల్ వుడ్ స్టార్ హీరోలలో ఒకరైన శివరాజ్ కుమార్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల విడుదలైన జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్ చిన్న రోల్ లో నటించి ఈ సినిమా సక్సెస్ సాధించడానికి కారణమయ్యారు. జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్ నటన కోలీవుడ్ ఆడియన్స్ కు ఎంతగానో నచ్చింది. శివరాజ్ కుమార్ యాక్టింగ్ కు సంబంధించి తమిళ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్యతో శివరాజ్ కుమార్ కు ప్రత్యేక అనుబంధం ఉంది.

భవిష్యత్తులో బాలయ్య శివరాజ్ కుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. అయితే దసరా పండుగ కానుకగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి మూవీ విడుదల కానుందని ఇప్పటికే అధికారికంగా స్పష్టత వచ్చింది. ఈ సినిమాకు పోటీగా లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. అయితే దసరా బాక్సాఫీస్ పోటీలో శివరాజ్ కుమార్ ఘోస్ట్ కూడా ఉందని సమాచారం. కన్నడతో పాటు తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

బాలయ్య (Balakrishna) సినిమాకు పోటీగా తెలుగులో తన సినిమాను విడుదల చేయడం శివరాజ్ కుమార్ కు ఇష్టం లేదని అయితే దసరా సీజన్ ను కాకుండా మరో సీజన్ ను ఎంచుకుంటే ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రావని శివరాజ్ కుమార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మాఫియా డాన్ పాత్రలో మూడు గెటప్స్ లో శివరాజ్ కుమార్ కనిపించనున్నారు. గతేడాది దసరా సమయంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ది ఘోస్ట్ సినిమా రిలీజ్ కాగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

అయితే ఈ ఏడాది దసరా కానుకగా దాదాపుగా అదే టైటిల్ తో రిలీజ్ కానున్న ఘోస్ట్ మాత్రం సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దసరా కానుకగా ఎక్కువ సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus