Bigg Boss Telugu 5: ఫైనల్ టాస్క్ లో ఎవరు పెర్ఫామ్ చేయలేకపోయారో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో ఐస్ టబ్ టాస్క్ అనేది కంటెస్టెంట్స్ హెల్త్ మీదకి తీస్కుని వచ్చింది. సన్నీ ఎటాక్ చేస్తాడన్న భయంతో సిరి, శ్రీరామ్ ఇద్దరూ చాలాసేపు ఐస్ టబ్ లో కాళ్లని అలాగే పెట్టి ఉంచారు. మధ్యలో పింకీ కాసేపు కాళ్లు బయటపెట్టేసరికి సన్నీ పింకీ టబ్ లోని బాల్స్ ని గ్రాబ్ చేశాడు. ఇక సిరి సన్నీ వేరేసైడ్ వెెళ్లినా కూడా కావాలనే పైయిన్ ని భరిస్తూ చాలాసేపు ఐస్ టబ్ లోనే ఉంది. అయితే, ఇక్కడ శ్రీరామ్ చంద్ర కూడా ఐస్ టబ్ లో నుంచీ కాళ్లని మారుస్తూ కాసేపు రిలాక్స్ అవుతూనే వచ్చాడు.

కానీ, పింకీ రాత్రిపూట గోరువెచ్చని నీళ్లతో కాళ్లకి మసాజ్ చేయడంతో కాళ్లకి బొబ్బలు బాగా వచ్చి నొప్పిని తెప్పించాయి. దీంతో శ్రీరామ్ చంద్ర బెడ్ పైనే ఫోకస్ గేమ్ ఆడాడు. అయితే, ఈరోజు టాస్క్ లో కంటెస్టెంట్స్ కండీషన్ చాలా సీరియస్ గా ఉందని సమాచారం. అడుగు తీసి అడుగు వేయలేనంత నొప్పి ఉందని చెప్తున్నారు. అందుకే, మూడో టాస్క్ లో పార్టిసిపేట్ చేయలేదట. ముఖ్యంగా శ్రీరామ్ ఇంకా సిరి ఇద్దరూ కూడా మూడా ఛాలెంజ్ ని ఎదుర్కోలేకపోయారు. దీంతో టిక్కెట్ టు ఫినాలే టాస్క్ కోసం వారి బదులు వేరేవాళ్లు గేమ్ లో పార్టిసిపేట్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది.

సిరి బదులుగా షణ్ముక్, అలాగే శ్రీరామ్ కి బదులుగా సన్నీ ఇద్దరూ గేమ్ ని ఆడారు. సన్నీ ప్లేస్ అవుట్ అయిపోయిన తర్వాత శ్రీరామ్ కోసం గేమ్ ఆడాడట. అంతేకాదు, ఇక్కడ రేస్ టు ఫినాలే టాస్క్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అయ్యారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక టాస్క్ కంటే కూడా హౌస్ లో కాజల్ ఇంకా షణ్ముక్ ల మద్యలో మాటల యుద్ధమే ఈరోజు ఎపిసోడ్ లో హైలెట్ అని అంటున్నారు. కేవలం హౌస్ మేట్స్ కండీషన్ బాగోలేకపోవడం వల్లే ఈటాస్క్ లేట్ అయ్యిందని కూడా చెప్తున్నారు. అదీ మేటర్.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus