War 2: ఈ విషయంలో కూడా ‘కూలి’ కంటే ‘వార్ 2’ ఎక్కువ..!

ఆగస్టు నెలలో అసలైన సినిమా పండుగ మొదలుకానుంది. ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న విడుదల కానుంది. ఈ సినిమా కనుక హిట్ అయితే ఆగస్టుకి శుభారంభాన్ని ఇచ్చినట్టే. అటు తర్వాత అంటే ఆగస్టు 14న 2 పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. అవే ‘కూలి’ ‘వార్ 2’. వాస్తవానికి ఇవి డబ్బింగ్ సినిమాలు. కానీ రజినీకాంత్ నటించిన ‘కూలి’ లో నాగార్జున స్పెషల్ రోల్ చేశాడు.

War 2 

ఇక హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించాడు. కాబట్టి.. తెలుగు ప్రేక్షకులకు ఇవి చాలా స్పెషల్ మూవీస్ అని చెప్పాలి. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. బయ్యర్స్ భారీ రేట్లు పెట్టి.. ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు.

‘వార్ 2’ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులు ‘సితార..’ నాగవంశీ రూ.80 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. అలాగే ‘కూలి’ థియేట్రికల్ హక్కులు ‘ఏషియన్ సురేష్’ లు అలాగే దిల్ రాజు(కొన్ని ఏరియాలు) దక్కించుకున్నారు. దాదాపు రూ.42 కోట్లకు ‘కూలి’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా… వీటి రన్ టైమ్స్ విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘వార్ 2’ సినిమా ఏకంగా 3 గంటల 5 నిమిషాల నిడివి కలిగి ఉంటుందట. ఇక ‘కూలి’ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉంటుందట.

శ్రీలీల డిమాండ్ల కంటే ఆమె డిమాండ్లు ఎక్కువవుతున్నాయట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus