సినిమా హిట్ అయితే.. గొడవ జరిగేదేమో!

  • March 20, 2021 / 04:46 PM IST

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ వర్కవుట్ కాలేదు. రీసెంట్ గా ఈ హీరో నటించిన ‘చావు కబురు చల్లగా’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేయడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తొలి షో నుండే ఈ సినిమాకి మిశ్రమ స్పందన రావడం మొదలైంది. భర్తను కోల్పోయిన అమ్మాయిని శ్మశానవాటికలో చూసి హీరో ప్రేమలో పడడం ఈ సినిమా మెయిన్ పాయింట్. ఈ లైన్ కొత్తగా ఉన్నప్పటికీ దాన్ని తెరపై ఆవిష్కరించడంలో విఫలమయ్యాడు దర్శకుడు.

అయితే ఈ సినిమా కోసం అనుకున్న పాయింట్ కూడా కొత్తది కాదని అంటున్నారు. ‘నివాసి’ అనే షార్ట్ ఫిలిం ఈ సినిమా కథకు ప్రేరణ కావొచ్చని తెలుస్తోంది. 2020లో ‘నివాసి’ షార్ట్ ఫిలింను విడుదల చేశారు. ఇందులో కూడా హీరో.. హీరోయిన్ ని స్మశాన వాటికలోనే చూసి ప్రేమిస్తాడు. ‘చావు కబురు చల్లగా’ సినిమాలో హీరో శవాల్ని తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ అయితే.. ‘నివాసి’లో హీరో కాటికాపరి కొడుకు. స్మశానంలోనే ఇల్లు కట్టుకొని ఉంటారు.

‘చావు కబురు చల్లగా’ సినిమాలో హీరో, అతడి తల్లి ఇద్దరూ మందు కొడుతుంటారు. ఈ షార్ట్ ఫిలింలో కూడా అంటే.. రెండు కథల్లోనూ కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. దీంతో ‘నివాసి’ షార్ట్ ఫిలిం చూసే దర్శకుడు కౌశిక్ ‘చావు కబురు చల్లగా’ సినిమా కథ రాసుకున్నాడని విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా గనుక నిజంగా హిట్ అయి ఉంటే.. కథ నాదంటూ పెద్ద గొడవ మొదలయ్యేదేమో. సినిమాకి ప్లాప్ టాక్ రావడంతో ఈ గొడవ తప్పిందని అనుకోవాలి!

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus