ఓవర్సీస్ మార్కెట్ పై కరోనా దెబ్బ!

లాక్ డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకోవడంతో దర్శకనిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. సోలోగా వచ్చిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ హిట్ అవ్వడంతో మిగిలిన దర్శకనిర్మాతలకు నమ్మకం పెరిగి వరుసగా సినిమాలను వదులుతున్నారు. టాలీవుడ్ కి సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. ‘క్రాక్’, ‘మాస్టర్’, ‘రెడ్’, అల్లుడు అదుర్స్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. వీటిలో ‘క్రాక్’ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.

అయితే అమెరికాలో మాత్రం ఏ సినిమాకి కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాలేదు. ప్రీమియర్ షోలు, మామూలు షోలు ఏదైనా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు పెద్ద సినిమా, మీడియం రేంజ్ సినిమా ఏదైనా.. మొదటి మూడు రోజుల్లోనే మిలియన్ డాలర్లు వసూళ్లు చేసేవి. కానీ ఇప్పుడు లక్ష డాలర్లు రావడం కూడా గగనం అన్నట్లుగా మారింది. ‘క్రాక్’ సినిమా విడుదలైన ఐదు రోజులైనా ఇప్పటివరకు లక్ష డాలర్ల మార్క్ అందుకోలేదని సమాచారం.

విజయ్ లాంటి కోలీవుడ్ స్టార్ హీరో సినిమాకి అతి తక్కువ ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ నటించిన ‘రెడ్’, బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ సినిమాల పరిస్థితి చెప్పుకోనక్కర్లేదు. ఈ సినిమాల కలెక్షన్స్ ని బట్టి అమెరికా మార్కెట్ ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదని అర్ధమవుతోంది. కనీసం వేసవి సినిమాలకైనా పరిస్థితి పుంజుకుంటుందేమో చూడాలి..!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus