రానా సినిమాకి కూడా కరోనా దెబ్బపడింది..!

దేశమంతా ఇప్పుడు అన్- లాక్ ప్రక్రియ మొదలయ్యింది. కాబట్టి జనాలు బయట విచ్చల విడిగా తిరిగేస్తున్నారు. అందులోనూ వర్షాకాలం కూడా కాబట్టి.. కరోనా విజృంభణ ఇప్పుడు మరింత పెరిగిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో రోజుకి వేలకు వేలు పైగా కేసులు నమోదవుతున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. ఇక సినిమా షూటింగ్లకు కూడా ఈ కరోనా పెద్ద ఇబ్బందే పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో..దాదాపు అన్ని సినిమాల షూటింగ్ లను మొదలుపెట్టాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

అయితే కొంతమంది నటులు కరోనా భారిన పడటంతో షూటింగ్ లకు ఇబ్బందిగా కూడా మారుతుంది. తాజాగా ‘విరాటపర్వం’ సినిమాలోని నటికి కూడా కరోనా సోకడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రానా హీరోగా నటిస్తున్న ‘విరాటపర్వం’ చిత్రంలో నటి జరీనా వహాబ్‌కు(61) కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. శ్వాస సమస్య , కీళ్ల నొప్పులు, మరియు జ్వరం తో సహా పలు తీవ్రమైన లక్షణాలతో ఆమె బాధపడుతోందని సమాచారం.

ఆమెలో ఆక్సిజెన్ లెవల్స్ కూడా తక్కువ ఉన్నట్టు వైద్యులు గుర్తించి.. వెంటిలేటర్ ‌పై ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఇక జరీనా వహాబ్‌.. ప్రముఖ నటుడు సూరజ్ పంచోలికి స్వయానా తల్లి. ఇక వేణు ఉడుగుల డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘విరాట పర్వం’ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా ప్రియమణి కీలక పాత్రపోషిస్తుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus