‘శేఖర్’ సినిమా విషయంలో విషయం కీలక మలుపు తిరిగింది. ఆర్థిక వ్యవహారాల కారణంగా గత కొన్ని రోజులుగా వాదనలు, ప్రతివాదనలు, కేసులు, కోర్టులు అంటూ తిరుగుతున్న సినిమా ప్రదర్శనలు ఆఖరికి నిలిచిపోయాయి. కోర్టు ఆదేశాలను పాటించని కారణంగా సినిమా ప్రదర్శనను నిలిపేశారు. ఆదివారం ఉదయం నుండి సినిమా షోలు వేయలేదు. రాజశేఖర్ హీరోగా జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
కోర్టు ఆదేశాల మేరకు అరవై లక్షల మేరకు సెక్యూరిటీగా డిపాజిట్ చేయాల్సి ఉంది. కానీ ఆ మేరకు జీవిత అండ్ కో చేయలేకపోయారు. దీంతో ఆంధ్ర, తెలంగాణ అంతటా షో లు నిలిపివేసారు. కీలకమైన ఆదివరాం నాడు షోలు వేయకపోవడంతో బాగా లాస్ అయ్యారనే చెప్పొచ్చు. కోర్టు ఆదేశాల ప్రకారం చూస్తే థియేటర్‌తోపాటు ఓటీటీ, శాటిలైట్, యూట్యూబ్ ఎలాంటి చోట్ల ప్రసారాలు చెయ్యకూడదు. సినిమాకు థియేటర్లలో మంచి టాక్ వస్తే.. ఓటీటీ, టీవీ హక్కులను అమ్ముకొని లాభం పొందుదామని జీవిత ఆలోచిస్తున్నారు.
ఆ విధంగా సినిమాకు లాభం వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా ఓ సినిమా విడుదలయ్యాక ప్రదర్శనలు నిలిపేయడం ఆందోళన కలిగించే విషయమే. సోమవారం ఏదో ఒకటి చేసి తిరిగి సినిమా ప్రదర్శనలు మొదలయ్యేలా చూసేందుకు జీవిత అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సినిమా ప్రదర్శన నిలిపేయడంపై రాజశేఖర్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘నాకు, నా కుటుంబానికి సినిమాయే జీవితం.
ఈ సినిమాను పూర్తి చేసి, విడుదల చేసేందుకు ఎంతో కష్టపడ్డాం. సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. కొందరు మాపై ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి ఈ రోజు మా సినిమాను నిలువరించారు. ఈ సినిమాపై మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం. ఏదోలా సినిమా థియేటర్లలో మళ్లీ ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాం’’ అని రాజశేఖర్ భావోద్వేగమయ్యారు. గతంలో సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌లోనూ రాజశేఖర్ ఇలా భావోద్వేగంగా తమ సినిమాను బతికించండి అని మాట్లాడిన విషయం తెలిసిందే.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!