నాని (Nani) సమర్పణలో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) నిర్మాణంలో రూపొందిన సినిమా ‘కోర్ట్’ (Court) . ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకి ‘స్టేట్ వర్సెస్ నో బడీ’ అనేది క్యాప్షన్. ‘కథలెన్నో’ అనే పాట, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin) సంగీతం అందించారు. రామ్ జగదీష్ దర్శకుడు. మార్చి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కంటెంట్ పై ఉన్న నమ్మకంతో 2 రోజుల ముందు నుండి ప్రీమియర్స్ వేస్తున్నాడు నిర్మాత నాని.
అయితే మరోపక్క ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నాని స్పెషల్ షో వేసి మరీ కోర్టు సినిమాని చూపించినట్టు సమాచారం. సినిమా చూశాక వారు తమ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా 2 గంటల 29 నిమిషాల నిడివి కలిగి ఉంటుందట. టీనేజ్ కి వచ్చిన ఓ అమ్మాయి, అబ్బాయి.. ఒకరినొకరు ప్రేమించుకోవడం.. అది నచ్చని అమ్మాయి ఇంటి వాళ్ళు వీళ్ళని విడదీసే ప్రాసెస్లో…
ఆ 19 ఏళ్ళ కుర్రాడిపై ‘ఫోక్సో’ వంటి భయంకరమైన సెక్షన్లతో కేసులు పెట్టి ఇరికించడం జరుగుతుందట. బీద కుటుంబంలో పుట్టిన ఆ కుర్రాడికి న్యాయం చేయడానికి ఏ లాయర్ ముందుకు రారు. వచ్చినా.. కోర్టులో వాదించినా ఆ కుర్రాడు నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి సాధ్యపడని పరిస్థితి. ఇలాంటి టైంలో ఓ కుర్ర లాయర్ (ప్రియదర్శి) ఆ కేసును టేకప్ చేయడం. ఆ తర్వాత అతనికి ఎదురైన పరిస్థితులు.. మిగతా సినిమా అని చూసిన వాళ్ళు చెబుతున్నారు.
‘పెద్దవాళ్ళకి ఈరోజుల్లో న్యాయం జరగడం లేదు’ అనే పాయింట్ తోనే ఈ సినిమా కూడా రూపొందిందట. ప్రియదర్శి నటన చాలా నేచురల్ గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అని అంటున్నారు. అలాగే టీనేజ్ లవర్స్ గా హర్ష్ రోషన్ (Harsh Roshan) , శ్రీదేవి ఆపళ్ళ చాలా చక్కగా చేశారట. శివాజీ (Sivaji) రోల్ కూడా బాగా వర్కౌట్ అయ్యిందని.. సినిమాకి క్లైమాక్స్ ప్రాణం అని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. మరి ప్రీమియర్స్ ముగిశాక ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి