కరోనా సామాన్యులను మాత్రమే కాదు సెలబ్రిటీలను కూడా విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే అమితాబ్, రాజమౌళి, విశాల్ వంటి సినీ సెలబ్రిటీలు దీని భారిన పడ్డారు. ఇటీవల స్టార్ హీరోయిన్ తమన్నాకు కూడా కరోనా సోకింది. ఇదిలా ఉండగా.. కోలీవుడ్ సీనియర్ హీరో మరియు ప్రము రాజకీయ నాయకుడు అయిన విజయ్ కాంత్ కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22న కరోనా కారణంగా హాస్పిటల్లో జాయినైన విజయ్ కాంత్ త్వరగానే కోలుకుని అక్టోబర్ 2న డిశ్చార్జ్ అయ్యారు.
అయితే అక్టోబర్ 6న (మంగళవారం) ఆయన మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారట. దాంతో ఈయనకు మళ్ళీ కరోనా ఎఫెక్ట్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో డి.ఎం.కె పార్టీ ఈ విషయం పై క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రస్తుతం విజయ్‌కాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ మధ్యనే కోవిడ్ నుండీ కోలుకున్న ఆయన..
కొన్ని టెస్టుల నిమిత్తం మాత్రమే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. కంగారు పడాల్సింది ఏమీ లేదు.. ఆయన ఆరోగ్యంగానే వున్నారు. విజయ్ కాంత్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను దయచేసి నమ్మకండి’ అంటూ డి.ఎం.కె పార్టీ పేర్కొంది.