కేజీఎఫ్(సిరీస్) (KGF) వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కథ అందించడం, ‘కేజీఎఫ్’ తో పాటు ‘కాంతార’ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ‘హోంబలే ఫిలిమ్స్’ వారి నిర్మాణం .. ఈ కాంబో సరిపోదా.. బ్లాక్ బస్టర్ కొట్టడానికి.కనీసం మినిమమ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడానికి..! కానీ నిన్న రిలీజ్ అయిన ‘బఘీర’ (Bagheera) కి ఆ కాంబినేషనల్ క్రేజ్ పనిచేయలేదు. ‘ఉగ్రం’ హీరో శ్రీ మురళి నటించిన సినిమా ఇది. సూరి దర్శకుడు.
Bagheera
ప్రశాంత్ నీల్ కథ అంటే ఏదో ఒకటి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం. బహుశా అతని కథని సరిగ్గా దర్శకుడు వాడుకోలేదో ఏమో కానీ.. ‘బఘీర’ తేలిపోయింది. ‘బ్యాట్ మెన్’ సినిమాని బెంగళూరు నేటివిటీతో చేయడం, సినిమా అంతా రొటీన్ గా ఉండటం.. ప్రేక్షకులకి రుచించలేదు. తెలుగులో ఈ సినిమాని ‘ఏషియన్ సురేష్’ సంస్థ విడుదల చేసింది. హైదరాబాద్లో దాదాపు 100 స్క్రీన్స్ లభించాయి. కానీ ఒక్క చోట కూడా హౌస్ ఫుల్ బోర్డు పడలేదు. కొన్ని ఏరియాల్లో అయితే 5 టికెట్లు కూడా బుక్ అవ్వకపోవడంతో షోలు క్యాన్సిల్ చేశారు.
దీంతో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.10 లక్షల షేర్ కూడా రాలేదు. మరోపక్క తెలుగు సినిమా అయితే కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘క’ (KA) సినిమాకి 130 స్క్రీన్స్ మాత్రమే వచ్చాయి. డబ్బింగ్ సినిమాతో పోలిస్తే స్ట్రైట్ తెలుగు సినిమాకి ఇవి తక్కువ స్క్రీన్స్ అనే చెప్పాలి. అయితే ఆ సినిమాకి 90 స్క్రీన్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక రెండో రోజు ‘బఘీర’ ని(Bagheera) చాలా స్క్రీన్స్ లో తీసేశారు. మాస్ ఏరియాల్లో కూడా ఈ సినిమా పుంజుకోలేకపోతుంది.