కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తొలి తెలుగు స్ట్రెయిట్ ఫిలిం ‘సార్’. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటిరోజు నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ మొదలైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విద్యావ్యవస్థలో కార్పోరేట్ దోపిడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా సామాన్య ప్రజలకు బాగా కనెక్ట్ అయింది. కార్పోరేట్ ఎడ్యుకేషన్ కి బాధితులుగా మారుతున్న చాలా మందికి ఈ సినిమా దగ్గరవుతుంది.
తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. విద్యావ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తూ.. చాలా సినిమాలు వచ్చినా.. వెంకీ అట్లూరి తన కథనంతో, డైలాగ్స్ తో జనాలకు కనెక్ట్ అయ్యేలా సినిమా తీయడంలో సక్సెస్ అయ్యారు. మౌత్ టాక్ తో సినిమాకి కలెక్షన్స్ బాగా పెరుగుతున్నాయి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సార్’ సినిమాకి థియేటర్ల సంఖ్య పెంచినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా కూడా విడుదలైంది.
దీనికి కూడా పాజిటివ్ టాక్ వస్తోంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. గీతాఆర్ట్స్ 2లో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి మూడు వారాల పాటు ఈ సినిమాలు మంచి కలెక్షన్స్ ను రాబట్టుకోవచ్చు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?