Suriya: సూర్య అభిమానులకు అదిరిపోయే తీపికబురు.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న సూర్య ప్రస్తుతం కంగువా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా సైతం సూర్య కోరుకున్న మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కంగువా సినిమాతో పాన్ ఇండియా హిట్ సూర్య ఖాతాలో చేరుతుందని ఆయన అభిమానులు సైతం ఫీలవుతున్నారు.

అయితే అభిమానులకు సూర్య తాజాగా మరో అదిరిపోయే తీపికబురు అందించారు. తన భవిష్యత్తు ప్రాజెక్ట్ ల గురించి వెల్లడిస్తూ రోలెక్స్ పై సినిమా ఉంటుందని అన్నారు. ఫ్యాన్స్ మీట్ లో సూర్య ఈ విషయాలను వెల్లడించారు. విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ పాత్రలో కనిపించేది కొన్ని నిమిషాలే అయినా ఆ పాత్రకు ప్రాణం పోశారు. రోలెక్స్ రోల్ లో భారీ ప్రాజెక్ట్ లో సూర్య నటిస్తే మామూలుగా ఉండదని సూర్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం కంగువా షూట్ తో బిజీగా ఉన్నానని ఈ సినిమా ఊహించిన దాని కంటే 100 రెట్లు అద్భుతంగా వచ్చిందని సూర్య అన్నారు. వేట్రిమారన్ డైరెక్షన్ లో విడుదలై2 సినిమాతో బిజీగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత మా కాంబినేషన్ లో వాడి వాసల్ మొదలవుతుందని లోకేశ్ కనగరాజ్ రోలెక్స్ పై కథ చెప్పారని ఆ కథ నాకెంతో నచ్చిందని సూర్య అన్నారు.

రోలెక్స్ పూర్తైన తర్వాత ఇరుంభకై మాయావి చేస్తానని సూర్య వెల్లడించారు. సూర్య చేసిన కామెంట్లు అభిమానులను ఆనందంలో, ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సూర్య తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus