KGF2, RRR: ఈసారి కె.జి.ఎఫ్2 పై పడ్డాడు.. ప్రశాంత్ నీల్ ను జీవితాంతం జైల్లో పెట్టాలట..!

‘కె.జి.ఎఫ్2’ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కన్నడ తో పాటు అన్ని భాషల్లోన విడుదలైంది. మొదటి షోతోనే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. హీరో యష్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించిన తీరుకి, ఎలివేషన్స్ కు మాస్ ఆడియెన్స్ ఫిదా అయిపోతున్నారు. క్లైమాక్స్ మాత్రం వీక్ అంటున్నారు. అయినప్పటికీ ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ లానే ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ లో కూడా ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయని.. ఆ మూవీకి ఏమాత్రం తగ్గలేదని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.

Click Here To Watch NOW

అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికే ఈ మూవీ భారీ వసూళ్ళను రాబట్టింది. ఈరోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా ఉంటాయి కాబట్టి రికార్డు కలెక్షన్లు నమోదు కావడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ‘కె.జి.ఎఫ్ 2’ అనేది ఓ చెత్త సినిమా అంటున్నాడు ఓ బాలీవుడ్ క్రిటిక్. అతను మరెవరో కాదు కె.ఆర్.కె(కమాల్ ఆర్ ఖాన్). ఈయన తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “సినిమా ప్రారంభమైన 30 నిమిషాల పాటు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.

దిమాక్ ఖరాబ్ అయ్యింది. ‘ఆర్.ఆర్.ఆర్’ కంటే కూడా ‘కె.జి.ఎఫ్2’ 10 రెట్లు చెత్త సినిమా. ఇలాంటి సినిమా బాగుంది అన్న ప్రేక్షకుల పై జాలి చూపించాలి. ఇలాంటి సినిమా తీసినందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ను జీవితాంతం జైల్లో పెట్టాలి. ఈ సినిమా పై ఆశలు పెట్టుకున్న ప్రేక్షకుల్ని అతను ఫూల్స్ ను చేసాడు. ఇలాంటి బ్రెయిన్ లేని దర్శకులను ఎంకరేజ్ చేయకూడదు” అంటూ అతను ఘాటుగా స్పందించాడు.

మొన్నటికి మొన్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి కూడా అతను ఇలాగే రివ్యూ ఇచ్చాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ చెత్త సినిమా అని రాజమౌళిని జైల్లో పెట్టాలంటూ అతను కామెంట్లు చేసాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus