Custody: ఆ రకంగా చూసుకుంటే… కస్టడీ నిర్మాత గట్టెక్కేసాడట..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందిన కస్టడీ మూవీ గత వారం అంటే మే 12న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. నాగచైతన్య , అరవింద్ స్వామి ల నటనకు మంచి మార్కులు పడ్డాయి.కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదు. అలా అని పూర్తిగా చేతులెత్తేసింది లేదు. ఇప్పటికీ డీసెంట్ షేర్స్ ను రాబడుతోంది. కానీ అది బిజినెస్ చేసిన రేంజ్ లో అయితే కాదు.

మరి ఈ చిత్రం నిర్మాతకి కూడా భారీ నష్టాలు వచ్చినట్టేనా, బయ్యర్స్ కు కూడా భారీ నష్టాలు వచ్చాయా అంటే కాదు..! వాస్తవానికి రామ్ నటించిన ది వారియర్ చిత్రం తెచ్చిన నష్టాలకు పరిహారంగా కస్టడీ థియేట్రికల్ హక్కులను చాలా వరకు తక్కువ రెట్లకే ఇచ్చారు. మరి ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా పెర్ఫార్మ్ చేయకపోతే.. అనే డౌట్ మనకి వచ్చినట్టు … బయ్యర్స్ కు రాదా. అందుకే రామ్ – బోయపాటి ల సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా వారికే….

రేటు తగ్గించి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. సో (Custody) కస్టడీ నిర్మాతకి ఎటువంటి ఇబ్బందీ లేదు. అందుకే ఇప్పుడు రామ్ – బోయపాటి ల సినిమాతో పాటు నాగార్జున – ప్రసన్న కుమార్ ల సినిమాని కూడా ప్యారలెల్ గా నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులపై మంచి అంచనాలే ఉన్నాయి

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus