అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో ‘డెకాయిట్’ (Dacoit) అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షానిల్ డియో (Shaneil Deo) ఈ చిత్రానికి దర్శకుడు. అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి గతంలో ఓ గ్లింప్స్ వచ్చింది. అప్పుడు శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా ఎంపికైంది. తర్వాత ఆమె తప్పుకోవడం.. మృణాల్ వచ్చి చేరింది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఈ విషయాన్ని తెలుపుతూ మరో గ్లింప్స్ ని వదిలారు. ఈ టీజర్ 55 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘హే జూలియట్ నీకు జరిగింది చాలా దారుణం.. ఇప్పటివరకు నిన్ను అంతా మోసం చేశారు. కానీ నేను నిన్ను మోసం చేయడానికి రాలేదు.. ‘ అంటూ చివర్లో అడివి శేష్ ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పాడు. దీంతో టీజర్ మొదలైంది. అడివి శేష్ జైలుకు వెళ్తున్న టైంలో ఖైదీలు ఉండే వ్యాన్ నుండి అతను తప్పించుకోవడం..
ఆ తర్వాత ఆ వ్యాన్ ను ట్రైన్ ఢీ- కొట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చే విజువల్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. గ్లింప్స్ లో హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో పాటు విలన్ గా చేస్తున్న అనురాగ్ కశ్యప్ ను కూడా చూపించారు. ఈ వీడియో సినిమాపై అంచనాలు పెంచే విధంగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :