ఈ రూమర్స్ తో మా నాన్న చాలా బాధపడుతున్నారు: రకుల్ ప్రీత్
- November 25, 2016 / 12:10 PM ISTByFilmy Focus
సెలిబ్రిటీలకు మీడియా వల్ల ఎంత క్రేజ్ వస్తుందో.. అదే విధంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. ఫిట్ నెస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఏమి చేయాలో తెలియక మీడియాపైనే మండిపడుతోంది. అసలు విషయంలోకి వెళితే.. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ కొన్ని రోజుల క్రితం జరిగిన గాలి కుమార్తె వివాహ వేడుకలో డ్యాన్స్ చేసింది. వేడుకకు వచ్చిన అతిథులను తన డ్యాన్స్ తో అలరించింది. అందుకు గాలి జనార్దన్ రెడ్డి బాగానే పారితోషికం ముట్టచెప్పినట్లు సమాచారం. అయితే ఒక రోజు డ్యాన్స్ ప్రదర్శనకు రకుల్ కోటి రూపాయలు అందుకున్నట్లు మీడియా కథనాలను ప్రచురించింది.
అంతే కాదు ఆదాయపు పన్ను శాఖ అధికారులు రకుల్ ఇంట సోదాలు నిర్వహించారని పత్రికల్లో రాశారు. వీటిని చదివిన రకుల్ తండ్రి చాలా బాధ పడ్డారట. ఇక్కడే ఈ భామకు కోపం తన్నుకు వచ్చింది. ” నేను డ్యాన్స్ చేయడానికి ఒకటికి మూడింతలు పారితోషికం తీసుకున్నానని, ఐటీ దాడి జరిగిందని రాస్తున్నారు. ఈ రూమర్స్ తో మా నాన్న చాలా బాధపడుతున్నారు. ఎవరూ నిజానిజాలను పరిశీలించడం లేదు. కనీసం నన్ను అడగడం లేదు. నేను మీడియాతో చాలా ఓపెన్‌గా ఉంటాను. వార్త రాసేముందు నన్ను ఎందుకు సంప్రదించరు ” అని రకుల్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించింది. ఇక నుంచైనా బ్యూటీ పై రూమర్స్ ఆగుతాయేమో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















