దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి రామ మోహనరావు అలియాస్ మోహన్ బాబు (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మోహన్‌బాబు మంగళవారం తుదిశ్వాస విడిచారు. బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో ఆయన కన్నుమూసినట్లు సన్నిహితులు తెలిపారు. దీంతో దగ్గుబాటి కుటుంబం విషాదంలో ఉంది. చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన రామమోహనరావు నిర్మాతగా 1979లో ‘ఒక చల్లని రాత్రి’ సినిమా తీశారు.
ఆ తర్వాత మరో రెండు సినిమాలను వేరే నిర్మాణ సంస్థలతో కలసి నిర్మించారు. చీరాలలో ఉన్న ఓ థియేటర్‌లో ఆయనకు భాగస్వామ్యం ఉంది. నటుడు కొల్లా అశోక్‌బాబు సోదరి శారదను రామమోహనరావు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రామమోహనరావు మృతికి తెలుగు నిర్మాతల మండలి సంతాపం తెలిపింది. రామానాయుడు పెద్ద తనయుడు, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తన కుటుంబంతో కలసి కారంచేడు వెళ్లి మోహన్‌బాబు భౌతికకాయానికి నివాళులర్పించారు.
సినిమా షూటింగ్ కోసం ముంబయిలో ఉన్న వెంకటేశ్ (Daggubati)కారంచేడు వెళ్లలేకపోయారని సమాచారం. బుధవారం బాబాయి పార్థివ దేహానికి నివాళి అర్పించడానికి వెంకీ వస్తారని సమాచారం. మరోవైపు మోహన్‌బాబు మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం కారంచేడులో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?