విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ హీరో, హీరోయిన్లుగా ‘పాగల్’ తర్వాత రూపొందిన మూవీ ‘దాస్ క ధమ్కీ’ (Das Ka Dhamki ) . ‘వన్మయే క్రియేషన్స్’ ‘విశ్వక్ సేన్ సినిమాస్’ బ్యానర్లపై కరాటే రాజు, విశ్వక్ సేన్ లు కలిసి ఈ చిత్రాన్ని రూ.20 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.విశ్వక్ సేన్ కెరీర్లో ఇది భారీ బడ్జెట్ మూవీ అని చెప్పాలి. లియోన్ జేమ్స్, రామ్ మిర్యాల సంగీతంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన లభించింది.
టీజర్, ట్రైలర్ లు బాగానే ఉండటంతో మార్చ్ 22న ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. అయినా కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఫస్ట్ డే విశ్వక్ సేన్ కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు అలాగే మూడో రోజు కూడా బాగా కలెక్ట్ చేసిందని చెప్పాలి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
2.02 cr
సీడెడ్
0.71 cr
ఉత్తరాంధ్ర
0.64 cr
ఈస్ట్
0.42 cr
వెస్ట్
0.26 cr
గుంటూరు
0.46 cr
కృష్ణా
0.30 cr
నెల్లూరు
0.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
5.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.72 cr
ఓవర్సీస్
0.97 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
6.69 cr (షేర్
‘దాస్ క ధమ్కీ’ చిత్రానికి రూ.7.58 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.7.9 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.6.69 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.1.21 కోట్ల షేర్ ను రాబట్టాలి.
3వ రోజున కూడా ఈ మూవీ బాగా హోల్డ్ చేసింది. వీకెండ్ కు మళ్ళీ గ్రోత్ చూపిస్తే కనుక బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఫైనల్ గా ఈ మూవీ విశ్వక్ సేన్ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే అవకాశం కూడా లేకపోలేదు.