నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సముద్ర ఖని, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నాని ఫ్రెండ్ గా నటించారు.
మొదటి రోజు ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది.దీంతో బుకింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. మొదటి రోజు నాని కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన ఈ చిత్రం రెండో రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 10.23 cr |
సీడెడ్ | 2.98 cr |
ఉత్తరాంధ్ర | 2.04 cr |
ఈస్ట్ | 1.18 cr |
వెస్ట్ | 0.71 cr |
గుంటూరు | 1.45 cr |
కృష్ణా | 0.89 cr |
నెల్లూరు | 0.45 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 19.93 cr |
కర్ణాటక | 2.11 cr |
తమిళనాడు | 0.43 cr |
కేరళ | 0.21 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.60 cr |
ఓవర్సీస్ | 5.60 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 28.88 cr (షేర్ |
‘దసరా’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.47.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.47.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.28.88 కోట్ల షేర్ ను రాబట్టింది.
బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ (Dasara) ఇంకా రూ.18.62 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు దగ్గర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?