Dasara: దసరా మూవీ క్లైమాక్స్ ఖర్చు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన దసరా సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు మరో 11 రోజుల సమయం ఉండగా నాని మాత్రమే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడుతున్నారు. దసరా మూవీ క్లైమాక్స్ కోసం ఏకంగా 5 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని సమాచారం అందుతోంది. దసరా సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని సమాచారం అందుతోంది.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే టైర్2 హీరోలలో నాని నంబర్ వన్ హీరోగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. పావుగంట సమయం పాటు క్లైమాక్స్ ఉంటుందని క్లైమాక్స్ ఎమోషనల్ గా సాగడంతో పాటు ఫైట్స్ ఉంటాయని బోగట్టా. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకునిగా పరిచయం అవుతున్నారనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోగా సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారని సమాచారం అందుతోంది.

ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే శ్రీకాంత్ ఓదెల స్టార్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. పుష్ప తరహా లుక్ లో నాని నటిస్తుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఈ తరహా కథాంశాలు మరిన్ని తెరకెక్కే అవకాశం ఉంది. న్యాచురల్ స్టార్ నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదు.

నాని పారితోషికం 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా నాని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు మరింత ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాని తన మార్కెట్ ను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. నాని ఇతర హీరోలకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus