Akhil: అఖిల్ కు మరో గోల్డెన్ ఛాన్స్ దొరికినట్టే..!

సినీ పరిశ్రమలో ఓ కొత్త దర్శకుడు ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు అంటే.. అతను హాట్ కేక్ అయిపోవడం ఖాయం. నిర్మాతలందరూ పే చెక్ లతో ఆ దర్శకుడి వెంట పడుతుంటారు. సరిగ్గా ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఇలాగే అయిపోయాడు. చాలా మంది నిర్మాతలు ఇతనికి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవడానికి వెంటపడుతున్నారు. కానీ శ్రీకాంత్ మాత్రం.. ఈ ఆఫర్లను ఒప్పుకోవడం లేదు. పెద్ద హీరోలతో సినిమా సెట్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది కానీ పారితోషికం అంతగా రాకపోవచ్చు.

అదే మిడ్ రేంజ్ హీరోతో కనుక సినిమా చేస్తే ఎక్కువ పారితోషికం వస్తుంది. కానీ శ్రీకాంత్ ఇప్పుడు అఖిల్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు వినికిడి. అఖిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్ళు కావస్తోంది. ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తప్ప ఇతని ఖాతాలో మరో హిట్టు లేదు. ‘ఏజెంట్’ పరిస్థితి అయోమయంగా ఉంది. ఈ సినిమా కోసం అఖిల్ దాదాపు 3 ఏళ్లుగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..

అఖిల్ (Akhil) తన తర్వాతి చిత్రాన్ని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ తో చేయబోతున్నట్టు తాజా సమాచారం. ఇటీవల ఈ యంగ్ డైరెక్టర్ అఖిల్ ను కలిసి కథ చెప్పడం.. అది ఓకే అవ్వడం జరిగిపోయిందట. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందని వినికిడి.

ఇదిలా ఉండగా.. ఓ పెద్ద హిట్టు కొట్టిన తర్వాత శ్రీకాంత్ కు పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు కూడా వస్తున్నా.. వాటిని కాదని అఖిల్ వంటి హీరోతో సినిమా చేయడం అంటే సాహసం అనే చెప్పాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus