నిన్న అంటే మార్చి 30న నాని నటించిన ‘దసరా’ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద బిగ్ నంబర్స్ నమోదవుతున్నాయి. చిత్ర బృందం అంతా హ్యాపీ. నాని అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇంతలోనే ఓ వివాదంలో చిక్కుకుంది ‘దసరా’ సినిమా.! విషయంలోకి వెళితే.. ‘దసరా’ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల అనే పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె అంగన్వాడీ టీచర్ గా నటించింది.
అయితే ఓ సన్నివేశంలో (Dasara) కీర్తి సురేష్ ఎవ్వరూ చూడకుండా.. ఆమె పనిచేస్తున్న చోటుకి వెళ్లి.. కోడిగుడ్లు, బియ్యం వంటివి దొంగతనం చేస్తున్నట్టు చూపించారు. అలాగే ఆమె ఆ గుడ్లు వంటివి తీసుకెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టు కూడా చూపించారు. ఈ సన్నివేశాల పట్ల అంగన్వాడీ టీచర్లు అభ్యంతారు వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ హెచ్చరించడం కూడా చర్చనీయాంశం అయ్యింది.
‘ఐస్ డి ఎస్ లో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సేవలను గుర్తించకుండా అంగన్వాడీ టీచర్లు దొంగలు అన్నట్టు చూపించారు. ఎన్నో ఏళ్లుగా అంగన్వాడీ టీచర్లు చేస్తున్న సేవలు ఎవ్వరికీ తెలీదు. కేవలం రూ.150 జీతం నుండి పనిచేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు కేంద్రం మాకు ఏమీ ఇవ్వడం లేదు. అయినా మా సొంత డబ్బులు పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాలు నడుపుతున్న సందర్భాలు ఉన్నాయి.
మాకు జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో పాటు మేము అందరికీ పాలు, గుడ్లు వంటివి ఇచ్చామా లేదా అని ఫోన్లు కూడా చేస్తారు. మేము ఫోటోలు కూడా తీసి పంపాలి. దర్శకుడు అవేవి చూడకుండా మమ్మల్ని దొంగలు అన్నట్టు సినిమాలో చూపించాడు. ఆ సన్నివేశాన్ని అర్జెంట్ గా తొలగించాలి. మేము ఆల్రెడీ సెన్సార్ బోర్డు సభ్యులకు లేక రాయడం జరిగింది. ఆ సన్నివేశాన్ని కనుక వెంటనే తొలగించకపోతే సినిమాని ఆడకుండా నిరసనకి దిరుగుతాము’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?