Deepika Padukone: గెహ్రాహియా గురించి దీపిక ఏం చెప్పిందంటే?

బోల్డ్‌ సీన్సు ఉన్నాయని… ఓ సినిమాను ఓటీటీలో నేరుగా విడుదల చేస్తున్నారు అంటే… ఆ సినిమాలో బోల్డ్‌ పర్సంటేజ్‌ ఎంత అనేది సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమానే ‘గెహ్రాహియా’. దీపిక పడుకొణె, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 11న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమా విశేషాలను చెబుతోంది. సినిమా ఏ రేంజిలో ఉంటుంది అంటే…

‘‘ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు’’ అని అభిమానులు అంటారు అని చెబుతోంది. అంతేకాదు… నన్ను ఇలాంటి పాత్రలో పాత్రలో చూసుండరు అంటూ దీపికా పడుకొణె కూడా బలంగా చెబుతోంది. సినిమా ట్రైలర్‌ చూస్తే ఎవరైనా ఇదే మాట అంటారు. బంధాలు, అనుబంధాలు, బంధాల్లోని బాధల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది అని ట్రైలర్‌ చూస్తే ఎవరైనా చెప్పేస్తారు. రెండు జంటల కథగా ఈ సినిమా రూపొందింది. అలీషా, జైన్‌ మధ్య కథ సాగుతుంది.

v

దీపిక, సిద్ధాంత్‌ మధ్య వచ్చే సన్నివేశాల్లో శృంగారం మోతాదు ఎక్కువగానే ఉంది. అలాగే అనన్య పాండే కూడా తన పాత్ర పరిధి మేరకు బోల్డ్‌గానే కనిపిస్తోంది. మోడ్రన్‌ ఏజ్‌ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో దీపికా, సిద్ధాంత్‌ మధ్య ముద్దు సన్నివేశాలున్నాయి. దాంతోపాటు రొమాంటిక్‌ సీన్లు కూడా కనిపిస్తున్నాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసమే కాకుండా కథ కోసమే సన్నివేశాలు క్రియేట్‌ చేశారు దర్శకుడు అని దీపిక చెప్పడం గమనార్హం.

సెట్‌లో అందరి ముందు కోస్టార్స్‌తో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడం అంత సులభమైన విషయం కాదు అని చెప్పిన దీపిక… ఈ సినిమా విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని చెప్పింది. షకున్‌ అన్ని విధాలుగా భద్రత కల్పించిన తర్వాతనే ముద్దు, రొమాంటిక్‌ సన్నివేశాలు చేయగలిగాను అని చెప్పింది దీపిక. సమాజంలోని అంశాలను ప్రభావితం చేస్తుంది అని చెబుతూ, బోల్డ్‌గా ఉంటుంది అని అంటున్న ఈ సినిమా పరిస్థితి ఏంటో చూడాలి. మరి ఈ సీన్ల విషయంలో నెటిజన్లు, సంఘాల వాళ్లు మనోభావాలు దెబ్బతింటాయేమో చూడాలి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!


చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus