Deepika Padukone: దీపిక సినిమా థియేటర్‌లోకి తీసుకురారట..!

ఏదైనా సినిమా విడుదలకు సిద్ధమవ్వడం ఆలస్యం… థియేటర్‌లోనా లేక ఓటీటీలోనా అనే ప్రశ్న మొదలవుతోంది. దానికి కారణం కరోనా తెచ్చిన పరిస్థితులే అని చెప్పొచ్చు. ఈ పరిస్థితి కేవలం తెలుగు చలన చిత్ర పరిశ్రమకే కాదు, మొత్తం దేశంలో ఇలానే ఉంది. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అయితే ఈ కారణం కాకుండా, వేరే రీజన్‌తో ఓ సినిమా ఓటీటీ బాట పడుతోందని సమాచారం. అయితే ఆ సినిమా బాలీవుడ్‌ది.

దీపికా పదుకొణె, అనన్య పాండే ముఖ్య పాత్రలో షకున్‌ బత్రా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. వీలున్నప్పుడల్లా చిత్రబృందం కూడా ఇదే మాట ఇన్‌డైరెక్ట్‌గా చెబుతూనే ఉంది. ఈ సినిమాలో శృంగార సన్నివేశాలు, ప్రేమ సన్నివేశాలు మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుందని, సెన్సార్‌ నుండి ఆ సీన్లు తప్పించుకొని రావడం కష్టమని చిత్రబృందం భావిస్తోందట.

అందుకే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని చిత్రబృందం ఆలోచిస్తోందట. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌తో చర్చలు జరిపిందట. అందులో ఏదో ఒక దాంట్లో వచ్చే జనవరిలో సినిమాను విడుదల చేస్తారని టాక్‌. వివాహేతర బంధాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. వాటి గురించి సున్నితమైన అంశాలను చర్చించే క్రమంలో కాస్త మోతాదు పెరిగిందంటున్నారు. ఓటీటీ అయితే సెన్సార్‌తో పెద్ద ఇబ్బంది ఉండదని షకున్‌ బత్రా అండ్‌ టీమ్‌ అనుకుంటోందట.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus