Deepika Padukone: ఒక్క నెక్లెస్ కోసం కోట్లు ఖర్చు పెట్టిన దీపికా!

75వ కేన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే సినీ సెలబ్రిటీలకు అతి పెద్ద పండగనే చెప్పాలి. ఈ వేడుకలో వివిధ దేశాలకు చెందిన సెలబ్రిటీలంతా రెడ్ కార్పెట్ హొయలు పోతారు. దీనికోసం విభిన్నమైన వస్త్రధారణతో అందరిని ఆకట్టుకుంటారు. స్పెషల్ గా డిజైన్ చేసిన బట్టలు, ఆకర్షణీయమైన ఆభరణాలతో తళుక్కున మెరుస్తారు సినీ తారలు. ఇదిలా ఉండగా..

ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి మన ఇండియా నుంచి కొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ నేతృత్వంలో మన భారత సెలబ్రెటీల టీమ్ హాజరైంది. అయితే ఈసారి అవార్డుల వేడుకలో దీపికా పదుకోన్ జ్యూరీ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా దీపికా ధరించిన దుస్తులు, ఆభరణాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఈ క్రమంలో దీపికా ధరించిన ఓ నెక్లెస్, దాని ధర ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఈ నెక్లెస్ పై అందరి దృష్టి పడడంతో దాని రేటు ఎంత ఉంటుందోనని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు. రేటు తెలుసుకున్న తరువాత షాక్ అవుతున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్ మీద దీపికా ధరించిన ఈ వజ్రాల నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నెక్లెస్ కు ముందు భాగంగా పులి ముఖాలు వచ్చేలా డిజైన్ చేశారు. ఈ పులుల కళ్ల స్థానంలో ఖరీదైన పచ్చలను పొదిగి ఉంది.

అయితే ఈ నెక్లెస్ ను ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ నగల తయారీ సంస్థ కార్టియర్‌ తయారు చేసిందట. పూర్తిగా 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయారు చేసిన ఈ నెక్లెస్‌ రేటు సుమారుగా రూ.3 కోట్ల 80లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ రేటు తెలుసుకున్న నెటిజన్లు షాకవుతున్నారు.

1

2

3

4

5

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus