‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకి కలెక్షన్స్ నిల్!

ఈ మధ్యకాలంలో హిట్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా సరైన కలెక్షన్స్ రావడం లేదు. దానికి కారణం జనాలు థియేటర్లకు వెళ్లకపోవడమే. చాలా మంది ఓటీటీలో సినిమా చూసుకుందామని థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. ఇది కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. రీసెంట్ గా చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. దీంతో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని ఆశించారు. కానీ చాలా చోట్ల ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది.

ఇప్పుడు అల్లు శిరీష్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. శుక్రవారం నాడు విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రివ్యూలు కూడా పాజిటివ్ గా రాశారు. సినిమాలో కామెడీ బాగా పండిందని అంటున్నారు. దీంతో వెంటనే సక్సెస్ మీట్ పెట్టి దానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు. అలా సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు. అయితే ఆ వేడుకలో అందరూ బన్నీపైనే దృష్టి పెట్టారు.

అలానే ‘పుష్ప’ సినిమా గురించి మాట్లాడి అసలు విషయాన్ని పక్కన పెట్టేశారు. దీంతో ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తోంది. వీకెండ్ కి కనీసం ఓ రూ.2 కోట్ల షేర్ వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుందని అనుకోవచ్చు. కానీ కోటిన్నర కూడా టచ్ చేయలేకపోయిందట.

వీక్ డేస్ లో ఎలానూ డ్రాప్ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజులు పెద్దగా అద్భుతాలు జరిగే ఛాన్స్ లేదు. ఇక ఈ వారం సమంత ‘యశోద’ సినిమా రిలీజ్ కాబోతుంది. అలానే ‘వర్షం’ రీరిలీజ్ ఉంది. ఈ రెండు సినిమాల మధ్య అల్లు శిరీష్ సినిమా నలిగిపోయే ఛాన్స్ ఉంది. సమంత సినిమా కచ్చితంగా ‘ఊర్వశివో రాక్షసివో’ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి శిరీష్ ఏం చేస్తాడో చూడాలి!

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus