బిగ్ బాస్ 4: గేమ్ లో అందర్నీ చిత్తడి చేస్తున్న దేత్తడి..!

  • December 3, 2020 / 11:21 AM IST

బిగ్ బాస్ హౌస్ లో మగాళ్లతో ధీటుగా హారిక గేమ్ ఆడుతోంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకూ జరిగిన ప్రతి టాస్క్ లో లాస్ట్ వరకూ అందరితో ఈక్వల్ గా వచ్చింది దేత్తడి హారిక. అన్ని టాస్క్ లలో తనదైన స్టైల్లో పెర్ఫామ్ చేస్తూ మగాళ్లకి సవాల్ గా మారుతోంది. చోటు చోటు అంటూ అందర్నీ ఆకట్టుకుంటున్న దేత్తడి ప్రతి గేమ్ లో 100శాతం ఎఫోర్ట్స్ ని పెడుతోంది. అంతేకాదు, ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి న ఆడవాళ్లందరినీ ఓవర్ టేక్ చేసి మరీ ముందుకు వెళ్లింది. ఒకానొక దశలో అరియానా దేత్తడికి మంచి పోటీ ఇచ్చినా ఇప్పుడు మాత్రం ఇవ్వలేకపోతోంది.

రేస్ టు ఫినాలే టాస్క్ లో హౌస్ మేట్స్ అందర్నీ చిత్తడి చేసి మరీ లెవల్ 2లోకి వెళ్లింది. అంతేకాదు, తన గేమ్ ఆడుతూనే మరోవైపు వేరే వాళ్లకి హెల్ప్ చేస్తుండటంతో ప్రేక్షకులని సైతం ఆకట్టుకుంటోంది. దేత్తడి హారిక గ్రాఫ్ ఫస్ట్ నుంచీ కూడా పెరుగుతూనే వచ్చింది. లాస్ట్ వీక్ నాగార్జున క్లాస్ తీస్కున్నప్పటినుంచీ తన గేమ్ లో గేర్ ని ఛేంజ్ చేసింది. తనకోసం గేమ్ ఆడుతూ సోహైల్ తో ఫైటింగ్ చేసింది.

పూలవర్షం కురుస్తుంటే తను ఎక్కువ పూలు కలెక్ట్ చేయలేనపుడు ఆర్గ్యుమెంట్ చేసింది. నాకు అందట్లేదు అని, మీరు బాగా పొడుగ్గా ఉన్నారు కాబట్టి బాగా కలెక్ట్ చేస్తున్నారు అన్నట్లుగా మాట్లాడి, సోహైల్ చేతిలో ఫ్లవర్స్ ని లాక్కుంది. అంతేకాదు, అక్కడే సోహైల్ గేమ్ ని ప్రశ్నించింది కూడా. చేతులోకెళ్లి లాక్కోకూడదు, అలాగని మడ్ లో పాతినవి లాక్కోకూడదు అంటే ఎలా అంటూ తన ఆవేదనని వ్యక్తం చేసింది. తను లాస్ట్ వరకూ వచ్చి ఓడిపోవాలా.. ఉట్టిగా ఖాళీగా కూర్చోవాలా అంటూ మాట్లాడింది.

అంతేకాదు, మరోవైపు మోనాల్ అండ్ అవినాష్ ఇష్యూలో కూడా మోనాల్ కి క్లారిటీ ఇచ్చింది. ఇలా టాస్క్ ప్రకారమే కాకుండా, గేమ్ లో జెన్యూనిటీని చూపిస్తూ ఇప్పుడు టైటిల్ ఫేవరెట్ గా మారింది హారిక. అదీ మేటర్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus