ఎన్టీఆర్ (Jr NTR) , దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత తెరకెక్కిన చిత్రం ‘దేవర’ (Devara). ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సమర్పణలో ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. సెప్టెంబర్ 27న ‘దేవర'(మొదటి భాగం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన సినిమా కావడంతో..
భారీ అంచనాల నడుమ కొంత మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది.అయితే టాక్ తో సంబంధం లేకుండా ‘దేవర’ మంచి ఓపెనింగ్స్ సాధించింది. మండే టెస్ట్ కూడా పాసయ్యింది అనే చెప్పాలి. ఒకసారి (Devara Collections) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 42.35 cr |
సీడెడ్ | 20.14 cr |
ఉత్తరాంధ్ర | 11.35 cr |
ఈస్ట్ | 7.03 cr |
వెస్ట్ | 5.68 cr |
గుంటూరు | 9.51 cr |
కృష్ణా | 6.37 cr |
నెల్లూరు | 4.17 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 106.60 cr |
కర్ణాటక | 12.04 cr |
తమిళనాడు | 2.00 cr |
కేరళ | 0.56 cr |
నార్త్ | 18.35 cr |
ఓవర్సీస్ | 30.70 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 170.25 cr (షేర్) |
‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.170.25 కోట్ల షేర్ ను రాబట్టి..రికార్డులు క్రియేట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.75 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఈరోజు గాంధీ జయంతి హాలిడే అడ్వాంటేజ్ ఉంది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.