Devara: ఎన్టీఆర్ వచ్చాడు.. చర్చలు మొదలుపెట్టిన ‘దేవర’ టీం!

ఎన్టీఆర్ (Jr NTR)  హీరోగా కొరటాల శివ  (Koratala Siva) దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) తర్వాత ‘దేవర’ (Devara) రూపొందింది. దీని మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యింది. మిక్స్డ్ టాక్ తో మొదలైన ‘దేవర’.. బాక్సాఫీస్ వద్ద మాత్రం సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. అన్ని భాషల్లోనూ సినిమా బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. ఈ క్రమంలో సినిమాకి కొంత పుష్ ఇవ్వాల్సిన బాధ్యత టీం పై ఉంది.రిలీజ్ కి ముందు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామని అనుకున్నారు.

Devara

భారీగా జనాలు తరలిరావడంతో.. అది క్యాన్సిల్ అయ్యింది. తర్వాత ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లడం జరిగింది. నిన్న రాత్రి తిరిగి ఇండియాకు బయల్దేరాడు. ఈరోజు ఎయిర్ పోర్ట్..లో తీసిన ఫోటోలు, వీడియోలతో.. అందరికీ ఈ విషయం పై క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ ఇలా రావడంతోనే.. దర్శకుడు కొరటాల అలాగే నిర్మాతలు ‘దేవర’ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ గురించి ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించారట. గాంధీ జయంతి హాలిడే, అలాగే దసరా హాలిడేస్ ని ‘దేవర’ క్యాష్ చేసుకోవాలి అంటే..

సినిమాకి సంబంధించి ఏదో ఒక ఈవెంట్ లేదా ప్రెస్ మీట్ పెట్టి ‘దేవర’ వార్తల్లో నిలిచేలా చేయాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది కాబట్టి..ఓ భారీ సక్సెస్ మీట్ నిర్వహించాలని ‘దేవర’ టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఎన్టీఆర్ కూడా సానుకూలంగా స్పందించాడట. అయితే ‘దేవర’ సక్సెస్ మీట్ ఎక్కడ నిర్వహిస్తారు? అనే విషయంపై మరో 2 రోజుల్లో క్లారిటీ వస్తుందని ఇన్సైడ్ టాక్ .

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus