Devara: దేవర సెకండాఫ్ అలా ఉండబోతుందా.. హైలెట్స్ ఇవేనంటూ?

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ (Koratala Siva)   కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర (Devara) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా నుంచి తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక పిక్ లీకైంది. వైరల్ అవుతున్న పిక్ లో బ్లాక్ డ్రెస్ లో యంగ్ లుక్ లో తారక్ కనిపిస్తున్నారు. దేవర సినిమాలో తారక్ కు విలన్ గా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటిస్తున్న సంగతి తెలిసిందే. తారక్ సైఫ్ మధ్య కీలక సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేశారు.

కల్కి సినిమాలో ప్రభాస్ (Prabhas) అమితాబ్ (Amitabh Bachchan)  కాంబో సీన్స్ ప్రేక్షకులను ఎంతలా మెప్పించాయో దేవరలో తారక్ సైఫ్ సీన్స్ అదే స్థాయిలో మెప్పిస్తాయని తెలుస్తోంది. దేవర సెకండాఫ్ లో ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ మధ్య యాక్షన్ సీన్స్ ఉంటాయని సినిమాకే హైలెట్ అయ్యే విధంగా ఈ సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమా సెకండాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

యాక్షన్ సీన్స్ తో పాటు తారక్ డైలాగ్ డెలివరీ సైతం కొత్తగా ఉంటుందని ఫ్యాన్స్ ను అంచనాలను మించి మెప్పించే మూవీ దేవర అవుతుందని ప్రచారం జరుగుతోంది. దేవర సెకండ్ సింగిల్ త్వరలో రిలీజ్ కానుండగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ పూర్తిస్థాయిలో మొదలుకానున్నాయి. దేవర మూవీ షూట్ దాదాపుగా పూర్తైనట్టేనని భోగట్టా.

అనిరుధ్ సైతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనులను శరవేగంగా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. దేవర సినిమా యాక్షన్ ప్రియులను ఊహించని స్థాయిలో మెప్పించనుందని తెలుస్తోంది. మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుందని భోగట్టా. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus