తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన కాంబినేషన్‌లలో మైత్రి మూవీ మేకర్స్ – దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కలయిక ఒకటి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఒక రికార్డ్. మొదటి సినిమా నుంచే వీరి కాంబినేషన్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ ముందుకు సాగింది. ఇప్పుడు 8వ సారి ‘పుష్ప 2: ది రూల్’తో వీరు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2015లో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడుతో (Srimanthudu) ఈ కాంబినేషన్ మొదలైంది.
ఈ సినిమా దేవి సంగీతంతో పాటు సామాజిక సందేశంతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో (Jr NTR) చేసిన జనతా గ్యారేజ్ (Janatha Garage) మరింత పెద్ద విజయాన్ని సాధించింది. దేవి బీజీఎం ఈ సినిమాలో కథానాయకుడి పాత్రను మరింత పవర్ఫుల్ గా నిలబెట్టింది. రంగస్థలంతో (Rangasthalam) దేవి, మైత్రి కాంబినేషన్ మరో రికార్డ్ ను అందుకుంది. రామ్ చరణ్ (Ram Charan) నటన, సుకుమార్ (Sukumar) కథనంతో పాటు దేవి అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను కొత్త అనుభూతులకు గురి చేశాయి.
ఉప్పెన (Uppena) చిత్రం పాటలు, దేవి సంగీతం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తూ, సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. అయితే ఈ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప: ది రైజ్ (Pushpa) ఒక చారిత్రక విజయంగా నిలిచింది. దేవి అందించిన పాటలు నేషనల్ లెవెల్‌లో సంచలనం సృష్టించాయి. బన్నీ (Allu Arjun) నటన, సుకుమార్ దర్శకత్వం, దేవి సంగీతం ఈ చిత్రానికి నేషనల్ అవార్డును తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి.
ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule) కూడా అదే స్థాయిలో అంచనాలు పెంచే విధంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకుంటుండగా, సినిమా రిలీజ్ తో దేవి BGM పై ప్రశంసలు అందుతున్నాయి. తన మ్యూజిక్‌తో మరోసారి ప్రేక్షకులను థియేటర్లుకు రప్పిస్తారని అంచనా. ఇక ఈ కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్స్ కూడా భారీ అంచనాలను పెంచుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) అలాగే అజిత్ (Ajith) గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్ట్స్ ఈ కాంబినేషన్‌లో రాబోతున్నాయి.