‘బలగం’ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన వేణు ఎల్దిండి దర్శకత్వంలో మలి సినిమాగా ‘ఎల్లమ్మ’ రాబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘బలగం’ సినిమా 2023 మార్చి లో రిలీజ్ అయ్యింది. 2 ఏళ్ళు దాటినా ఎల్లమ్మ షూటింగ్ ప్రారంభం కాలేదు. అందుకు ప్రధాన కారణం ఈ ప్రాజెక్టులో హీరో ఫిక్స్ అవ్వకపోవడం వల్లనే అని చెప్పాలి. మొదట నేచురల్ స్టార్ నానితో ఈ ప్రాజెక్టు చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రయత్నించారు.
కానీ నాని వరుస కమిట్మెంట్స్ వల్ల కుదర్లేదు. అటు తర్వాత ‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జని సంప్రదించారు దిల్ రాజు. కానీ తేజ సజ్జ ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్టులు అయితే తప్ప.. వేరే సినిమా చేసేలా లేడు. ఫైనల్ గా నితిన్ ఫిక్స్ అన్నారు. కానీ ‘తమ్ముడు’ డిజాస్టర్ అవ్వడంతో నితిన్ ను ఈ ప్రాజెక్టు నుండి దిల్ రాజు.. తప్పించినట్టు తెలుస్తుంది. తర్వాత మళ్ళీ నానితోనే ఈ ప్రాజెక్టుని చేయబోతున్నట్టు కూడా ప్రచారం జరిగింది.
కానీ అది ప్రచారంగానే మిగిలిపోయింది. ఫైనల్ గా ‘ఎల్లమ్మ’ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంపికైనట్టు టాక్ వినిపించింది. ఇప్పుడు అతను కూడా తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఫైనల్ గా ఈ ప్రాజెక్టులోకి ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా ఫిక్స్ అయినట్టు సమాచారం. అతను మరెవరో కాదు.. దేవి శ్రీ ప్రసాద్. వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది నిజమే.
ఎల్లమ్మ తో హీరోగా డెబ్యూ ఇవ్వబోతున్నారట దేవి. అతన్ని హీరోగా లాంచ్ చేయాలని గతంలో అతని స్నేహితుడు, స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ ప్రయత్నించారు. కానీ ఎందుకో అది సెట్ అవ్వలేదు. ఫైనల్ గా వేణు .. దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా లాంచ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారు దిల్ రాజు.