ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్ యాక్టింగ్ స్కూల్ డేస్‌కి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎర్లీ డేస్‌లో అంటే స్కూలు జాయిన్ అయిన కొత్తలో చరణ్ యాక్టింగ్ బేసిక్స్ వీడియో అది. దాన్ని కొందరు ట్రోల్ చేస్తే.. మరికొందరు అదొక యాక్టింగ్ ఎక్సర్‌సైజ్ అని, ఎవరైనా ఇలానే చేస్తారు అని సమర్థిస్తుంటారు. అయితే ఇప్పుడు మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని బట్టి రామ్‌చరణ్ ఫస్ట్ హీరోయిన్ నేహా శర్మ కాదు.. శ్రియా శరన్. అవును మీరు చదివింది కరెక్టే.
2007లో ‘చిరుత’ సినిమాతో తెరంగేట్రం చేశాడు రామ్ చరణ్. అయితే ఈ సినిమా కంటే ముందు చాలా యాక్టింగ్ స్కూల్స్‌లో నటనలో మెలకువలు నేర్చుకున్నాడు. అలా ముంబయిలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్‌లో కూడా కోర్సు చేశాడు. అక్కడ యాక్టింగ్ డేస్‌లో ఉన్నప్పుడు ఓసారి హీరోయిన్ శ్రియతో ఓ కాంబినేషన్ సీన్ యాక్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల పోస్ట్ చేసింది.
యాక్టింగ్ కోచ్ కిషోర్ నమిత్ కపూర్ ఆ వీడియోలో మాట్లాడుతూ రామ్ చరణ్, శ్రియా శరణ్ (అప్పటికే ఆమె సౌత్‌లో స్టార్ హీరోయిన్)తో ఓ సీన్ షూట్ చేశాం. కెమెరా ముందు చరణ్‌కు ఇది మొదటి సన్నివేశం. నిజానికి అతను చాలా ఇబ్బందిపడ్డాడు అని చెప్పారు. స్టార్ హీరోయిన్ అయినా శ్రియ ఎందుకు ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చింది అనేగా మీ డౌట్. శ్రియ అప్పటికే సినిమాల్లో నటించినా నటనను ఇంకాస్త బెటర్ చేసుకోవడానికి మరోసారి ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చిందట.
ఇక చరణ్ 2007లో ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో నేహా శర్మ తనకు హీరోయిన్‌గా నటించింది. అయితే కెమెరా ముందు ఫస్ట్ హీరోయిన్ శ్రియనే అని చెప్పాలి. ఇక చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.