తెలుగు చిత్రసీమలో మ్యూజిక్ కంపోజర్‌గా ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) . గతంలో వరుస సినిమాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్, ఇపుడు సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను కొనసాగిస్తున్నారు. ‘పుష్ప 1’తో (Pushpa) దేశ వ్యాప్తంగా తన క్రేజ్ మరో స్థాయికి తీసుకెళ్లాడు. నేషనల్ అవార్డు పొందడమే కాకుండా, పాన్ ఇండియా రేంజ్‌లో తన మ్యూజికల్ టాలెంట్‌ని చాటాడు. ఇపుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన ‘కంగువా’ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Devi Sri Prasad Vs Anirudh:
ఈ సినిమా ఎనిమిది భాషల్లో రిలీజ్ కానుంది. అదే విధంగా, డిసెంబర్ 6న రాబోతున్న ‘పుష్ప 2’ (Pushpa 2) కూడా మ్యూజిక్ పరంగా దేవిశ్రీకి అత్యంత కీలకంగా మారింది. ఈ రెండు చిత్రాలే ఇప్పుడు ప్రధాన ఆయుధంగా మారాయి. వీటి సక్సెస్‌తోనే ఆయన కెరియర్‌కు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ హవా నడుస్తోంది. తమిళ చిత్రసీమలో అనిరుద్ (Anirudh Ravichander) మ్యూజిక్‌కు ఉన్న క్రేజ్‌తో అనేక పెద్ద స్టార్స్ ఆయన్నే ఎంచుకుంటున్నారు.
ఇటీవల అనిరుద్ సౌండ్‌ట్రాక్‌లకు నేషనల్ వైడ్‌లోనే మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘జైలర్’ (Jailer) , ‘దేవర’ (Devara) వంటి చిత్రాలకు అనిరుద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్ హిట్స్ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌లో కూడా అనిరుద్ స్నేహితుడిని ఎక్కువ మంది దర్శకులు కనెక్ట్ అవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ శక్తిని మరోసారి నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
‘పుష్ప 2’, ‘కంగువా’ (Kanguva) చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే సంగీతం సినిమాల విజయానికి కీలకమయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు అతనికి విజయం అందిస్తే, తిరిగి మ్యూజిక్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలడు.