Dhanush, Aishwarya: త్వరలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్న ధనుష్ – ఐశ్వర్య?

సినిమా వాళ్ళు పెళ్లి చేసుకోవడం.. కలిసి సంతోషంగా జీవించలేకపోతే విడాకులు తీసుకోవడం అనేవి సర్వసాధారణమైన విషయాలు. అందరికీ సోషల్ మీడియా వాడకం పెరిగింది కాబట్టి.. ఇలాంటి విషయాలు ఇప్పుడు టక్కున బయటకు వచ్చేస్తున్నాయి. కానీ సోషల్ మీడియా అందుబాటులో లేని రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుని.. రెండేసి, మూడేసి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ ఏడాది ఆరంభంలో ధనుష్, ఐశ్వర్య లు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ పెద్ద షాకిచ్చారు.

18 ఏళ్ళు కలిసి కాపురం చేసి, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులై వీరు ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ బాధపెట్టింది. వీరు విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో పేర్లు మార్చుకోవడం, వీళ్ళు కలిసున్న ఫోటోలను డిలీట్ చేసుకోవడం వంటివి చేశారు.దీంతో వీళ్ళు ఇక కలిసే ప్రసక్తే లేదని అంతా ఫిక్స్ అయిపోయారు. మొన్నామధ్య వీళ్ళ పిల్లల స్కూల్లో ఏదో ఫంక్షన్ కు అటెండ్ అయితే ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

దీంతో వీళ్ళు మళ్ళీ కలిస్తే బాగుణ్ణు అని వీరి అభిమానులు కోరుకున్నారు. ధనుష్ తండ్రి కూడా ఓ సందర్భంలో వీరి మధ్య ఉన్నవి చిన్న చిన్న గొడవలే అంటూ చెప్పారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం వీళ్ళు విడాకుల ప్రపోజల్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రజినీ కాంత్ మరియు వీరి కుటుంబ పెద్దలు వీరి సమక్షంలో జరిపిన చర్చల్లో.. పెద్దల మాటని గౌరవించి వీరు సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus