టాలీవుడ్లో దర్శకులకి హీరోలు దొరకడం చాలా కష్టంగా మారింది. ముందుగా వెళ్లి నిర్మాతకి కథ చెప్పి ఓకే చేయించుకోవాలి. నిర్మాత ఓకే అయితేనే హీరో కథ వింటాడు. లేదు అంటే వినడు. ఒకవేళ నిర్మాత కథ ఓకే చేసినా.. హీరో వెంటనే డేట్స్ ఇస్తాడు అని కచ్చితంగా చెప్పలేం. వెయిటింగ్లో ఉండాల్సిందే. ఇప్పుడు స్టార్ హీరోలు ఖాళీగా లేరు. ప్రభాస్ (Prabhas) , మహేష్ (Mahesh Babu), రాంచరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్ (Jr NTR) వంటి హీరోలు 2028 వరకు బిజీ.
Dhanush
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి.. కమిట్ అయిన ప్రాజెక్టులు చేయడం కూడా కష్టం. ఇక సీనియర్ హీరోలు, మిడ్ రేంజ్ హీరోలు.. సందీప్ కిషన్ (Sundeep Kishan) వంటి టైర్ 3 హీరోలు కూడా బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కి పక్క భాషల్లో ఉన్న హీరోలే టార్గెట్ అవుతున్నారు. వెంకీ అట్లూరి (Venky Atluri) వెళ్లి ధనుష్ (Dhanush) తో ‘సార్’ (Sir), దుల్కర్ సల్మాన్ తో (Dulquer Salmaan) ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) వంటి సినిమాలు చేశాడు.ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నాడు.
వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) విజయ్ తో (Vijay Thalapathy) సినిమా చేశాడు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ తో ఓ ప్రాజెక్టు ఓకే చేసుకున్నట్టు టాక్ నడుస్తుంది. పవన్ సాధినేని వంటి యంగ్ డైరెక్టర్ కూడా దుల్కర్ తో సినిమా సెట్ చేసుకున్నాడు. కాబట్టి.. ఇదే మంచి టైం అని భావించి పక్క భాషల హీరోలు పారితోషికాలు పెంచేస్తున్నారు. దుల్కర్ ఇప్పుడు రూ.20 కోట్లు తీసుకుంటున్నాడు అని టాక్. మలయాళంలో అతనికి రూ.10 కోట్ల వరకు మాత్రమే ఇస్తారు. ధనుష్ కూడా అంతే.
‘సార్’ సినిమాకి అతను రూ.40 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. ‘కుబేర’ (Kubera) కోసం రూ.50 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. వెంకీ అట్లూరి చేయబోతున్న ‘హానెస్ట్ రాజు’ అనే సినిమా కోసం రూ.60 కోట్ల డిమాండ్ చేస్తున్నాడట. దీంతో సితార వంశీ (Suryadevara Naga Vamsi) షాక్ అయ్యి వెనకడుగు వేయాలని డిసైడ్ అయినట్టు టాక్ వినిపిస్తుంది.