Dhanush: దటీజ్ ధనుష్ అంటున్న అభిమానులు.. విడిపోయినా ప్రేమ తగ్గలేదుగా!

స్టార్ హీరో ధనుష్ కు ప్రేక్షకులలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమాకు తెలుగులో ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రాకపోయినా తమిళంలో మాత్రం ఈ సినిమా అంచనాలను మించి హిట్టైంది. ధనుష్ మాజీ భార్య డైరెక్షన్ లో తెరకెక్కిన లాల్ సలామ్ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కగా రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించడంతో తమిళనాడులో ఈ సినిమాపై బాగానే అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లాల్ సలామ్ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. లాల్ సలామ్ రిలీజ్ సందర్భంగా ధనుష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ధనుష్ ట్విట్టర్ వేదికగా “లాల్ సలామ్ ఫ్రమ్ టుడే” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా ధనుష్ భార్యపై ప్రేమను మామపై అభిమానాన్ని చాటుకున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి.

ధనుష్ ట్వీట్ కు ఏకంగా 17,700కు పైగా లైక్స్ వచ్చాయి. సాధారణంగా సెలబ్రిటీలు విడిపోయిన తర్వాత భాగస్వామి ప్రాజెక్ట్ ల గురించి కామెంట్ చేయడానికి ఇష్టపడరు. రజనీకాంత్ కు వీరాభిమాని అయిన ధనుష్ అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో రజనీపై తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ధనుష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై సైతం భారీ స్థాయిలో అంచనాలు నెలకొంటున్నాయి.

స్టార్ డైరెక్టర్లకు ధనుష్ (Dhanush) ఛాన్స్ ఇస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటున్న ధనుష్ మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ధనుష్, ఐశ్వర్య తమ మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుని భవిష్యత్తులో కలిసి జీవనం సాగించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus