Dhanush: లెజెండరీ బయోపిక్స్‌ చేస్తానంటున్న ధనుష్‌!

బయోపిక్స్‌ నటించాలని చాలామంది ఉంటుంది. అయితే అంత ధైర్యం చేయరు అంతే. అయితే బయోపిక్స్‌ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మాత్రం ఇబ్బందులు పడతారు. సరైన వ్యక్తి కథ ఎంచుకోవాలి, దానిని సరైన రీతిలో చేసి చూపించాలి. అప్పుడే అందరి మన్ననలు పొందుతారు. సినిమా పరిశ్రమలో కీలకమైన వ్యక్తుల జీవితాల్ని కథలుగా తీసుకొని సినిమాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. మిస్‌ అయితే ఏమవుతుందో బాలకృష్ణ అభిమానులకు బాగా తెలుసు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ధనుష్‌ కోసం.

దక్షిణాదిన ఈ మధ్య జీవిత కథలు ఎక్కువగా వస్తున్నాయి కదా… మీరు ఎవరి బయోపిక్‌లో నటించాలని అనుకుంటున్నారు అని ధనుష్‌ను అడిగితే ఇద్దరి పేర్లు చెప్పాడు. అందులో ఒక పేరు అందరూ ఊహించిందే. రెండో పేరు అయితే మాత్రం ఊహించనది. ఊహించిన పేరు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఊహించని పేరు గురించి చూద్దాం. ఆ పేరు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. అవును ఆయనే. స్వర మాంత్రికుడు ఇళయరాజా జీవిత కథతో సినిమా వస్తే బాగుంటుందని చాలా రోజుల నుండి చాలామంది అనుకుంటూనే ఉన్నారు.

అయితే ఈ దిశగా ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు ధనుష్‌ ఆ సినిమా చేయడానికి ముందుకొచ్చిన నేపథ్యంలో ఎవరైనా ఆయన కథను ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతారేమో చూడాలి. సంగీత దర్శకుడిగానే కాకుండా, వ్యక్తిగా కూడా ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ముందు చెప్పినట్లు… ఆ మొదటి పర్సన్‌ గురించి చర్చకొద్దాం. ఆ వ్యక్తే తలైవా సూర్‌ప్టార్‌ రజనీకాంత్‌. అవును మామ కథలో హీరోగా కనిపించడమంటే తనకు చాలా ఇష్టమని ధనుష్‌ చెబుతున్నాడు.

రజనీకాంత్‌లా ధనుష్‌… స్టైల్‌గా సినిమాల్లో కనిపించడం చాలాసార్లు చూసే ఉంటారు. అలాంటిది సినిమా మొత్తం ధనుష్‌… రజనీలా కనిపిస్తే ఎంత బాగుంటుందో కదా. అయినా రజనీకాంత్‌ బయోపిక్‌ వస్తుందంటే ఆ హై వేరు. జీవితంలో కష్ట సుఖాల్ని సమానంగా చూసి పెరిగిన వ్యక్తి రజనీకాంత్‌. కండక్టర్‌గా వృత్తి జీవితం ప్రారంభించిన రజనీ… ఇప్పుడు కోట్లాది అభిమానుల గుండెల్లో దేవుడు. ప్రేక్షకుల్లో పవర్‌ ఫుల్‌ సూపర్‌ స్టార్‌. మరి రజనీ గురించి బయోపిక్‌ ఆలోచన ఎవరు చేస్తారో. ఇక్కడ ధనుష్‌ రెడీ.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus