Dhanush: మధురై దంపతులకు భారీ షాకిచ్చిన ధనుష్!

ఈ మధ్య కాలంలో ధనుష్ వృత్తిపరంగా, వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. గతేడాది ధనుష్ భార్యతో విడాకులు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. మరోవైపు మధురైకి చెందిన దంపతులు ధనుష్ తమ కొడుకేనని తమ ఖర్చుల కోసం నెలకు 65,000 రూపాయలు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కతిరేసన్, మీనాక్షి దంపతులు చేసిన కామెంట్లపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ధనుష్ వాళ్ల కొడుకేనని నమ్ముతుంటే మరి కొందరు మాత్రం డబ్బుల కోసం దంపతులు ఆ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు.

కతిరేసన్, మీనాక్షి దంపతులు తమ మూడో కొడుకు చిన్నతనంలోనే ఇంటినుంచి పారిపోయాడని సినిమాలపై ఉండే ఆసక్తితో తమ కొడుకు ఈ విధంగా చేశాడని ఆ కొడుకు ధనుష్ అని చెబుతున్నారు. కోర్టు ధనుష్ ను డీ.ఎన్.ఏ టెస్ట్ చేయించుకోవాలని సూచించినా ధనుష్ అందుకు అంగీకరించలేదు. ధనుష్ గతంలో జనన ధృవీకరణ పత్రంను సమర్పించడం ద్వారా కోర్టు ఈ కేసును కొట్టేయడం జరిగింది. అయితే దంపతులు కొన్నిరోజుల క్రితం మళ్లీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ధనుష్, ఆయన తండ్రి లాయర్ ద్వారా నోటీసులు పంపించారు.

ధనుష్ ఆ నోటీస్ ద్వారా తమపై ఆరోపణలు చేస్తున్న వాళ్లు క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేయాలని అలా చేయని పక్షంలో 10 కోట్ల రూపాయల పరువునష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. ఈ నోటీస్ గురించి మధురై దంపతులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నెటిజన్లు చెబుతున్నారు.

ధనుష్ నెటిజన్ల సూచన విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఈ తరహా వివాదాలు తలెత్తడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలువురు సెలబ్రిటీల విషయంలో ఈ తరహా ఆరోపణలు వ్యక్తం కావడం గమనార్హం. మరోవైపు ధనుష్ ప్రస్తుతం తెలుగులో సర్ అనే సినిమాలో నటిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.