సినిమా బడ్జెట్ ఎంతైనా తన సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రాణం పెట్టి పని చేస్తారు. ప్రతి సీన్, ప్రతి షాట్ అద్భుతంగా రావడం కోసం తారక్ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. సింగిల్ టేక్ హీరోగా పేరు సంపాదించుకున్న తారక్ దేవర సినిమాపై ఏ రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవర (Devara) సినిమా కోసం ఒకింత భారీ మొత్తంలో ఖర్చైంది. సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం, గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉండటంతో ఈ సినిమాకు డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు.
రెమ్యునరేషన్లతో కలిపి దాదాపుగా 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాకు ఖర్చు అయిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రైట్స్ విషయంలో ఎన్టీఆర్, మేకర్స్ ఆచితూచి వ్యవహరించారు. మరీ భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులను విక్రయించలేదు. అందువల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో రిజల్ట్ ఆధారంగా ఈ సినిమాకు లాభాలు వచ్చేది లేనిది డిసైడ్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రదర్ కళ్యాణ్ రామ్ కు (Nandamuri Kalyan Ram) ఈ సినిమా సక్సెస్ సాధించడం మరింత కీలకమనే సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం 150 కోట్ల రూపాయల రేంజ్ లో పెట్టుబడులు పెట్టారని మరో నిర్మాత మిక్కిలినేని సుధార్ (Sudhakar Mikkilineni) కూడా అదే స్థాయిలో ఇన్వెస్ట్ చేశారని భోగట్టా. బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలకు హిట్ టాక్ వస్తే కలెక్షన్ల వర్షం కురుస్తుందనే సంగతి తెలిసిందే.
దేవర మూవీ కాన్సెప్ట్ పాన్ ఇండియా మూవీకి సూట్ అయ్యే కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమాలో హిందీలో కూడా సులువుగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటిస్తుండటం ఈ సినిమాకు అదనపు అడ్వాంటేజ్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. దేవర1, దేవర2 బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.