విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లేటెస్ట్ మూవీ ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star) ఈరోజు ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇక్కడ ఎగబడి చూస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమా పెద్దగా ఆడలేదు.. అక్కడ మిస్ అయిన వాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉంది కాబట్టి.. ఈరోజు వాళ్ళు ఓటీటీలో చూసి తమ అభిప్రాయాన్ని ట్విట్టర్లో పంచుకుంటున్నారు. ‘కొంతమంది ఇది మరీ తీసి పారేసే మూవీ కాదు అంటున్నారు’. ఇంకొంతమంది విజయ్ దేవరకొండ ‘యాక్షన్ సీన్స్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు అంటున్నారు’ ,
అలాగే మరికొంతమంది విజయ్, మృణాల్ (Mrunal Thakur) జంట బాగుంది అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంకో బ్యాచ్ మాత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’ పై ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. రవిబాబు పాత్ర హీరో వదినతో అసభ్యంగా మాట్లాడతాడు. అందుకు హీరోకి కోపం వచ్చి.. ఫైట్ చేయడానికి ఏకంగా తన ఫ్యామిలీతో పాటు.. ఆ రౌడీ(రవిబాబు) ఉండే ప్లేస్ కి వస్తాడు. అక్కడ ఓ ఫైట్ ఉంటుంది. అక్కడ విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ కూడా బాగుంటుంది.
కాకపోతే ఈ ఫైట్ అంతా అయిపోయాక.. ఆ రౌడీ చెవి వద్దకి హీరో వెళ్లి.. ‘మీ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు.. మా ఇంట్లో కూడా మగాళ్లు ఉంటారు.. గోడ, ట్రైన్.. ఎక్కడపడితే అక్కడ..’ అంటూ ఓ ఘోరమైన డైలాగ్ చెబుతాడు. ‘పిల్లలకు మంచి విషయం చెబుతానని.. స్కూల్ మానిపించి తీసుకొచ్చి హీరో అలా మాట్లాడటం ఏంటి?’ అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నిజంగానే ఆ డైలాగ్స్ దర్శకుడు అనవసరంగా పెట్టాడేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.