తమిళ, తెలుగు భాషల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ధనుష్ (Dhanush) ఒకరు. ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరెక్షన్ లో నాగార్జునతో (Nagarjuna) కలిసి కుబేర ప్రాజెక్ట్ లో నటిస్తుండగా తాజాగా ఈ సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ వీడియో విడుదలైంది. నాగ్ ఈ సినిమాలో వయస్సుకు తగ్గ పాత్రలో కనిపిస్తున్నారు. రష్మిక (Rashmika) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అందిస్తున్నారు. ధనుష్ సినిమాలకు సులువుగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.
అయితే ధనుష్ ఈ స్థాయిలో చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు ఉన్నాయి. ఒక సందర్భంలో తనకు ఎదురైన దారుణమైన పరిస్థితులు, అవమానాల గురించి ధనుష్ చెప్పుకొచ్చారు. తను హీరోగా నటిస్తున్న రెండో సినిమా షూట్ సమయంలో హీరో ఎక్కడ అని కొంతమంది అడిగితే తాను వేరే వ్యక్తిని చూపించానని ధనుష్ అన్నారు. ఆ తర్వాత వాళ్లకు నేనే హీరో అని తెలియడంతో “ఆటో డ్రైవర్ లా ఉన్నాడు..
వీడు హీరో ఏంటి” అని అవమానించేలా కామెంట్లు చేశారని ధనుష్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కారులో కూర్చొని ఏడ్చానని ధనుష్ పేర్కొన్నారు. అలా కెరీర్ తొలినాళ్లలో అవమానాలను ఎదుర్కొన్న ధనుష్ ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ధనుష్ ఎక్కువగా తెలుగు డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తున్నారు. ధనుష్ ప్రస్తుతం టాలీవుడ్ బ్యానర్లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
వరుస విజయాలు సాధిస్తున్న శేఖర్ కమ్ముల ధనుష్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ధనుష్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం ధనుష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ధనుష్ సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.