కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని” వెళ్లిపోకే” పాటను తాజాగా భీంలా నాయక్ చిత్ర దర్శకుడు సాగర్ కె చంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్రంలోని పాటను విడుదల చేయడం జరిగింది. పాట చాలా బాగుంది. చాలా రిచ్‌గా చిత్రీకరించారు. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటితో పాటుచిత్ర దర్శకుడు సలీం మాలిక్, సంగీత దర్శకులు రాప్రాక్ షకీల్, కెమెరామెన్ దర్శన్, అక్ష ఖాన్ స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, రైటర్ భవానీ ప్రసాద్, హీరోష మ్ము, మరో హీరో అరుణ్ వర్మ (సత్తి పండు)ఆర్టిస్ట్ సమీర్, కో డైరెక్టర్ రాజా తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ చిత్రంలోని సాంగ్‌ని విడుదల చేసి, ఆశీస్సులు అందించిన ప్రముఖ దర్శకులు సాగర్ కె చంద్ర గారికి మా టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ నెలాఖరుకు‘దర్జా’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు