ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు ఆవిష్కరించిన ‘దర్జా’ మూవీ టీజర్

‘ కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు.కాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్ర టీజర్ ను విడుదల చేయడం జరిగింది. టీజర్ బాగుంది.

Click Here To Watch NOW

ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని అనిపిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు కామినేని శ్రీనివాస్, ఏపీ ఆక్వా అసోసియేషన్ చైర్మెన్ భూమాల శ్రీరామ్ మూర్తి, చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి ,కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటితో పాటు షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), హీరోయిన్, శిరీష.. సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్, సినిమాటోగ్రాఫర్ దర్శన్, స్ర్కిఫ్ట్‌ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, , రైటర్ భవాని ప్రసాద్, ఆర్టిస్ట్ సమీర్ తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ..  మా టీజర్ నురిలీజ్ చేసిన సురేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి థాంక్స్ తెలుపుకుంటున్నాను. అన్నారు

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus